ముంబై: ఒక విద్యార్థిని స్కూల్ బిల్డింగ్ పైనుంచి కిందకు దూకింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించింది. (Girl Jumps Off School Building) బాలిక మృతి గురించి ఆమె కుటుంబానికి స్కూల్ యాజమాన్యం సమాచారం ఇచ్చింది. అయితే స్కూల్ టీచర్ల వేధింపుల వల్లనే తన కుమార్తె ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తండ్రి ఆరోపించాడు. మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మస్తాగడ్లో నివసించే 13 ఏళ్ల ఆరోహి దీపక్ బిడ్లాన్, సీటీఎంకే గుజరాతీ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది. శుక్రవారం ఉదయం ఆమె స్కూల్కు చేరుకున్నది.
కాగా, ఉదయం 7.30-8 గంటల మధ్య స్కూల్ బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి ఆరోహి కిందకు దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్కూల్ సిబ్బంది హాస్పిటల్కు తరలించారు. ఆమె తండ్రికి సమాచారం ఇచ్చారు. అయితే ఆ విద్యార్థిని అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
మరోవైపు ఆరోహి మరణంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. అయితే తన కుమార్తె మృతికి స్కూల్ టీచర్ల వేధింపులు కారణమని ఆరోహి తండ్రి ఆరోపించాడు. కాగా, వేధింపుల కారణంగా స్కూల్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం నవంబర్ నెలలో ఇది నాలుగో సంఘటన.
Also Read:
Man Kills Younger Brother | తమ్ముడి నేర ప్రవర్తన సహించలేక.. హత్య చేసిన అన్న
Sensitive Naval Data Leaked To Pak | నేవీ కీలక సమాచారం పాక్కు లీక్.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
Watch: మినీ లారీని ఢీకొట్టిన వాహనం.. తర్వాత ఏం జరిగిందంటే?