Glenn Philips | ఫిలిప్స్ డైవింగ్ క్యాచ్.. షాకైన ఇంగ్లండ్ యువ క్రికెటర్..!
Glenn Philips : మైదానంలో పక్షిలాంటి విన్యాసాలకు కేరాఫ్‌గా పేరొందిన గ్లెన్ ఫిలిప్స్(Glenn Philips) మరోసారి ఔరా అనిపించాడు. ప్రేమదాస మైదానంలో ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెథెల్(21)ను ఆశ్చర్యపరుస్తూ డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు.
Glenn Philips : మైదానంలో పక్షిలాంటి విన్యాసాలకు కేరాఫ్‌గా పేరొందిన గ్లెన్ ఫిలిప్స్(Glenn Philips) మరోసారి ఔరా అనిపించాడు. ప్రేమదాస మైదానంలో ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెథెల్(21)ను ఆశ్చర్యపరుస్తూ డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. రచిన్ రవీంద్ర వేసిన 9వ ఓవర్లో బెథెల్ మిడ్ వికెట్ దిశగా ఆడిన బంతిని ఒడుపుగా అందుకున్నాడీ ఫ్లైయింగ్ ఫీల్డర్.
బెథెల్ ఆడిన బంతి తనవైపే రావడం గమనించిన ఫిలిప్స్ .. పరుగున తీస్తూ ముందుకు డైవ్ చేస్తూ బంతి నేలను తాకేలోపే రెండు చేతులతో ఒడిసిపట్టాడు. అంతే.. బెథెల్ సహా, కివీస్ ఆటగాళ్లు.. స్టేడియంలోని ప్రేక్షకులు వాట్ ఏ క్యాచ్ అని ఒక్కసారిగా ఆశ్చర్యంలో మునిపోయారు. అంతకుముందు బౌలింగ్‌లోనూ డేంజరస్ హ్యారీ బ్రూక్ వికెట్ తీసిన అతడు ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టాడు.
Glenn Philips 🦅 pic.twitter.com/m8cRhrSNH6
— Rajeesh Sarangy (@rajeesh7620) February 27, 2026
ప్రేమదాస స్టేడియంలో పాకిస్థాన్‌ను చిత్తు చేసి సెమీస్ బెర్తు పట్టేసిన ఇంగ్లండ్ ఛేదనలో తడబడుతోంది. సూపర్ 8 చివరి మ్యాచ్‌లో ఓపెనర్లు ఫిల్ సాల్ట్(2), జోస్ బట్లర్(0)లు విఫలమయ్యారు. జాకబ్ బెథెల్(21) జతగా హ్యారీ బ్రూక్(26) దూకుడు పెంచగా.. పవర్ ప్లేలో 47 రన్స్.. వచ్చాయి. శాంట్నర్ కట్టడి చేస్తుండడంతో గ్లెన్ ఫిలిప్స్ ఓవర్లో పెద్ద షాట్‌కు యత్నించిన బ్రూక్ బౌండరీ లైన్‌వద్ద డారిల్ మిచెల్ చేతికి దొరికాడు. కాసేపటికే రచిన్ రవీంద్ర ఓవర్లో బెథెల్ డీప్ మిడ్ వికెట్ దిశలో కొట్టిన బంతిని ఫిలిప్స్ గాల్లోకి డైవ్ చేస్తూ అందకున్నాడు. దాంతో.. 58 వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది ఇంగ్లండ్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

