NZ vs ENG : సెమీస్ బెర్తు దక్కాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు గుండెకోతే మిగిలింది. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠ రేపిన మ్యాచ్‌ను విల్ జాక్స్(32 నాటౌట్) రెహాన్ అహ్మద్(19 నాటౌట్)లు సంచలన ఆటతో ఇంగ్లండ్ వైపు తిప్పారు. ప్రధాన బ్యాటర్లను ఔట్ చేసి గెలుపుపై ధీమాతో ఉన్న కివీస్‌కు షాకిస్తూ ఈ ద్వయం.. రెండు ఓవర్లలోనే 38 రన్స్ రాబట్టి బ్లాక్ క్యాప్స్ సెమీస్ చేరకుండా అడ్డుపడ్డారు. తద్వారా పాకిస్థాన్‌కు కూడా తలుపులు తెరిచే ఉన్నాయి.
పొట్టి ప్రపంచకప్ నాకౌట్ దశను ఇంగ్లండ్ అజేయంగా ముగించింది. శ్రీలంక, పాకిస్థాన్‌ను చిత్తు చేసి సెమీస్ బెర్తు పట్టేసిన ఇంగ్లండ్ చివరి మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్‌కు పంచ్ ఇచ్చింది. ప్రేమదాస మైదానంలో ఉత్కంఠ రేపిన పోరులో హ్యారీ బ్రూక్ సేన జయభేరి మోగించింది. గ్లెన్ ఫిలిప్స్ వేసిన 18వ ఓవర్లో విల్ జాక్స్(32 నాటౌట్), రెహాన్ అహ్మద్(19 నాటౌట్)లు 22 రన్స్ రాబట్టి మ్యాచ్‌ను కివీస్ నుంచి లాగేసుకున్నారు. 4 వికెట్ల తేడాతో గెలుపొందిన ఇంగ్లండ్ గ్రూప్ బీలో రెండో సెమీస్ బెర్తు రేసును ఆసక్తికరంగా మార్చేసింది.
Pakistan will need to win by 64 runs or chase in around 13.1 overs against Sri Lanka to overtake New Zealand and qualify for the semi-finals 👀 pic.twitter.com/s8UkSxoju4
— ESPNcricinfo (@ESPNcricinfo) February 27, 2026
కివీస్ నిర్దేశించిన 160 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్ ఓపెనర్లు ఫిల్ సాల్ట్(2), జోస్ బట్లర్(0)లు విఫలమయ్యారు. జాకబ్ బెథెల్(21) జతగా హ్యారీ బ్రూక్(26) దూకుడు పెంచగా.. పవర్ ప్లేలో 47 రన్స్.. వచ్చాయి. శాంట్నర్ కట్టడి చేస్తుండడంతో గ్లెన్ ఫిలిప్స్ ఓవర్లో పెద్ద షాట్‌కు యత్నించిన బ్రూక్ బౌండరీ లైన్‌వద్ద డారిల్ మిచెల్ చేతికి దొరికాడు. కాసేపటికే రచిన్ రవీంద్ర ఓవర్లో బెథెల్ డీప్ మిడ్ వికెట్ దిశలో కొట్టిన బంతిని ఫిలిప్స్ గాల్లోకి డైవ్ చేస్తూ అందకున్నాడు. దాంతో.. 58 వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది ఇంగ్లండ్. ఐదో వికెట్‌కు కీలక భాగస్వామ్యంలో ఇంగ్లండ్‌ను గెలుప దిశగా నడిపిస్తున్న టామ్ బ్యాంటన్(39), సామ్ కరన్(24)ల జోడీని రచిన్ విడదీశాడు. సామ్ కరన్ నేరుగా ఫిలిప్స్ చేతుల్లోకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగడంతో 42 రన్స్ భాగస్వామ్యానికి తెరపడింది.
• 4/27 against Sri Lanka
• 3/19 against EnglandRachin Ravindra has nailed it in Colombo 👏 pic.twitter.com/pT6mQ9eNhc
— ESPNcricinfo (@ESPNcricinfo) February 27, 2026
భారీ షాట్లు ఆడుతున్న అతడిని చాప్మన్ సూపర్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. కానీ, ఫిలిప్స్‌కు షాకిస్తూ రెహాన్ అహ్మద్(19 నాటౌట్) స్ట్రెయిట్‌గా భారీ సిక్సర్ బాదగా నాలుగో బంతిని అమాంతం స్టాండ్స్‌లోకి పంపిన విల్ జాక్స్(32 నాటౌట్).. ఐదో బంతినీ బౌండరీకి తరలించాడు.చివరి బంతికి ఫోర్ రాగా.. సమీకరణం 12 బంతుల్లో 21 రన్స్‌గా మారింది. శాంట్నర్ ఓవర్లో రెహాన్ సిక్సర్‌తో చివరి ఓవర్లో 5 పరుగులు అవసరమయ్యాయి. హెన్రీ సంధించిన మూడో బంతి వికెట్ కీపర్ చేతులకు దొరక్కుండా బౌండరీకి వెల్లడంతో 4 వికెట్లతో ఇంగ్లండ్ గెలుపొందింది.
Super 8 ಹಂತದಲ್ಲಿ ಸೋಲೇ ಇಲ್ಲದ ಸರದಾರರು ✅#T20WorldCup | #SUPER8 | #ENGvsNZ pic.twitter.com/k49Cbs2KJe
— Star Sports Kannada (@StarSportsKan) February 27, 2026
సెమీస్‌పై గురి పెట్టిన న్యూజిలాండ్ శుభారంభం లభించినా భారీ స్కోర్ చేయలేకపోయింది. పవర్ ప్లేలోనే దంచేసి 56 రన్స్ పిండుకున్న ఓపెనర్లు టిమ్ సీఫర్ట్(35), ఫిన్ అలెన్(29) ఔటయ్యాక.. మిడిలార్డర్‌ను ఇంగ్లండ్ స్పిన్నర్లు చుట్టేశారు. ఆదిల్ రషీద్(2-28), విల్ జాక్స్(2-23) తిప్పేయగా.. కివీస్ హిట్టర్లు తోకముడిచారు. సారథి మిచెల్ శాంట్నర్(9 నాటౌట్) చివరి బంతిని స్టాండ్స్‌లోకి పంపడంతో కివీస్ జట్టు ఇంగ్లండ్‌కు 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.