Festivals | పండుగల సమయంలో స్వీట్లను ఎక్కువగా తింటే షుగర్ లెవల్స్ ఎప్పటికీ అలాగే ఉంటాయా..?
పండుగలు, వేడుకలు వచ్చాయంటే స్వీట్లు, పిండి వంటలు, చక్కెర పానీయాలు తీసుకోవడం సాధారణం. అయితే కొన్ని రోజుల పాటు మితిమీరిన చక్కెర పదార్థాలు తీసుకున్న తర్వాత తిరిగి సాధారణ ఆహారపు అలవాట్లకు మారినా రక్తంలో చక్కెర స్థాయిలు వెంటనే అదుపులోకి వస్తాయా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది.
Festivals | పండుగలు, వేడుకలు వచ్చాయంటే స్వీట్లు, పిండి వంటలు, చక్కెర పానీయాలు తీసుకోవడం సాధారణం. అయితే కొన్ని రోజుల పాటు మితిమీరిన చక్కెర పదార్థాలు తీసుకున్న తర్వాత తిరిగి సాధారణ ఆహారపు అలవాట్లకు మారినా రక్తంలో చక్కెర స్థాయిలు వెంటనే అదుపులోకి వస్తాయా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ముఖ్యంగా మధుమేహం లేదా ప్రీడయాబెటిస్ ఉన్నవారిలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని రోజులు ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల ప్రతి ఒక్కరిలో వారాల తరబడి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ఉంటాయని చెప్పడానికి తగిన ఆధారాలు లేవు. చక్కెర స్థాయిలు నిరంతరం అసాధారణంగా నమోదవుతుంటే మాత్రం వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.
స్వీట్లను తిన్నాక పరిస్థితి ఎలా ఉంటుంది..?
మనం తీసుకునే కార్బొహైడ్రేట్లు జీర్ణక్రియ సమయంలో చక్కెరలుగా విడిపోయి రక్తంలో కలుస్తాయి. ఈ గ్లూకోజ్‌ను శరీర కణాలు ఉపయోగించుకోవడానికి, అదనపు గ్లూకోజ్‌ను నిల్వ చేసుకోవడానికి క్లోమగ్రంథి ఉత్పత్తి చేసే ఇన్సులిన్ సహాయపడుతుంది. సాధారణంగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించగలిగే వారిలో ఈ ప్రక్రియ ద్వారా కొంత సమయానికి గ్లూకోజ్ స్థాయిలు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయి. భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర పెరగడం సహజమే. అయితే తీసుకున్న ఆహారం పరిమాణం, శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి, దానికి శరీరం స్పందించే విధానాన్ని బట్టి ఈ పెరుగుదలలో తేడాలు ఉంటాయి. కొన్ని రోజుల పాటు శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకోవడం జీవక్రియపై ప్రభావం చూపుతాయి. స్వల్పకాలంలో అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోవడంతోపాటు ఇన్సులిన్‌కు కాలేయం స్పందించే సామర్థ్యం తగ్గినట్లు చిన్నపాటి అధ్యయనాలు వెల్లడించాయి. అయితే ఆరోగ్యవంతుల్లో కొద్దిరోజుల పాటు అతిగా ఆహారం తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వం, గ్లూకోజ్ స్పందనలో మార్పులు వస్తాయని నిరూపితం కాలేదు.
ప్రీడయాబెటిస్ ఉంటే..
ముఖ్యంగా ప్రీడయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర నియంత్రణ ఇప్పటికే బలహీనంగా ఉంటుంది. ఇన్సులిన్ నిరోధకత కారణంగా శరీర కణాలు ఇన్సులిన్‌కు సరిగా స్పందించలేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ పరిమాణంలో ఆహారం తీసుకోవడం సమస్యను మరింత పెంచుతుంది. మధుమేహం ఉన్నవారిలో అధిక కార్బొహైడ్రేట్ల వినియోగం, మందులు సక్రమంగా వాడకపోవడం, ఇన్సులిన్ మోతాదులో తప్పులు చేయడం వల్ల చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. పండుగల సమయంలో వ్యాయామం తగ్గడం, నిద్ర సరిగా లేకపోవడం, ఒత్తిడి, అనారోగ్యం కూడా రక్తంలో గ్లూకోజ్ పెరుగుదలకు కారణమవుతాయి. స్వీట్లు మానేసినా అన్నం, చపాతీలు, ఆలుగడ్డలు వంటి కార్బొహైడ్రేట్లు అధికంగా తీసుకుంటే చక్కెర స్థాయిలపై ప్రభావం కొనసాగుతుంది. బెల్లం, తేనె, బ్రౌన్ షుగర్ కూడా కార్బొహైడ్రేట్లకు మూలాలేనని గుర్తుంచుకోవాలి.
మితిమీరి చక్కెరలను తీసుకుంటే..
మితిమీరిన చక్కెర తీసుకున్న తర్వాత తిరిగి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడం ముఖ్యం. తగిన పరిమాణంలో కార్బొహైడ్రేట్లు, కూరగాయలు, పప్పులు, బీన్స్, గుడ్లు, చేపలు, చక్కెర కలపని పెరుగు వంటి ప్రొటీన్లు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. పండ్ల రసాలకు బదులుగా పండ్లను తినాలి. చక్కెర పానీయాలకు బదులుగా నీటిని ఎంచుకోవాలి. పరిస్థితిని సరిచేసుకోవాలనే ఉద్దేశంతో అతిగా ఉపవాసాలు ఉండడం, డిటాక్స్ పద్ధతులను అనుసరించడం మంచిది కాదు. భోజనం తర్వాత వీలైతే నడవడం, తగినంత నిద్రపోవడం, వైద్యుల సూచనల మేరకు నీటిని తీసుకోవడం అవసరం. రక్తంలో చక్కెర స్థాయిలు నిరంతరం ఎక్కువగా నమోదవుతున్నా, అధిక దాహం, తరచూ మూత్ర విసర్జన, కారణం లేకుండా బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపించినా వైద్యులను సంప్రదించాలి.
ఆరోగ్యకరమైన జీవనశైలి ముఖ్యం..
ఉపవాస రక్త గ్లూకోజ్ స్థాయి డెసిలీటర్కు 126 మిల్లీగ్రాములు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే మధుమేహం ఉండే అవకాశం ఉంటుంది. అయితే నిర్ధారణకు ప్రయోగశాల పరీక్షలు అవసరం. హెచ్‌బీఏ1సీ పరీక్ష గత మూడు నెలల సగటు రక్త చక్కెర స్థాయిలను తెలియజేస్తుంది. కాబట్టి కొన్ని రోజుల పాటు స్వీట్లు ఎక్కువగా తిన్నంత మాత్రాన ఆందోళన చెందకుండా, తిరిగి క్రమబద్ధమైన జీవనశైలిని పాటించాలి. సాధారణ ఆహారపు అలవాట్లకు మారిన తర్వాత కూడా చక్కెర స్థాయిలు అదుపులోకి రాకపోతే అసలు కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Festivals | పండుగల సమయంలో స్వీట్లను ఎక్కువగా తింటే షుగర్ లెవల్స్ ఎప్పటికీ అలాగే ఉంటాయా..?
JEE Main | ఈ రాత్రి 12 గంటలకు ముగియనున్న గడువు.. ఇప్పటికే 13 లక్షలు దాటిన జేఈఈ దరఖాస్తులు..!
Health tips | మీలో ఈ లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోండి..!
KTR | ఒకాయన అమిత్ షా ఎప్పుడు చెప్పులు విప్పుతాడా అని ఎదురు చేస్తాడు..! ఇంకొకాయన బాడీ గార్డులా మారిపోతాడు
KTR | రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అంటే అది కాదు..! ఫ్యూచర్ ఉన్న సిటీ మన వరంగల్
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

