JEE Main | ఈ రాత్రి 12 గంటలకు ముగియనున్న గడువు.. ఇప్పటికే 13 లక్షలు దాటిన జేఈఈ దరఖాస్తులు..!
JEE Main | జేఈఈ (మెయిన్)-2027 (JEE Main) సెషన్-1 దరఖాస్తుల గడువు ఈ రాత్రి 12 గంటలకు ముగియనుంది. ఈ క్రమంలో ఇప్పటికే 13.10 లక్షల మందికిపైగా అభ్యర్థులు ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేశారు. సోషల్ మీడియా ఖాతా ఎక్స్ ద్వారా ఎన్టీఏ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు మొత్తం 15,04,866 మంది రిజిస్ట్రేషన్ ఫారమ్‌లు సమర్పించగా.. అందులో 13,10,493 మంది అభ్యర్థులు ఫీజు చెల్లించారు.
JEE Main : జేఈఈ (మెయిన్)-2027 (JEE Main) సెషన్-1 దరఖాస్తుల గడువు ఈ రాత్రి 12 గంటలకు ముగియనుంది. ఈ క్రమంలో ఇప్పటికే 13.10 లక్షల మందికిపైగా అభ్యర్థులు ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేశారు. సోషల్ మీడియా ఖాతా ఎక్స్ ద్వారా ఎన్టీఏ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు మొత్తం 15,04,866 మంది రిజిస్ట్రేషన్ ఫారమ్‌లు సమర్పించగా.. అందులో 13,10,493 మంది అభ్యర్థులు ఫీజు చెల్లించారు.
ఈ రాత్రి 12 గంటల తర్వాత దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. లేట్ ఫీజుతో నవంబర్ 26 రాత్రి 12 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ఉంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను అసంపూర్తిగా వదిలేయవద్దని ఎన్టీఏ సూచించింది. తదుపరి దశల్లో గుర్తింపు ధ్రువీకరణ, బయోమెట్రిక్ ప్రక్రియల్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు డిజిలాకర్, జన్ పరిచయ్ లేదా ఈ-ప్రమాణ్ ద్వారా లాగిన్ కావాలని స్పష్టంచేసింది.
ఆన్లైన్ ఫారమ్ నింపే ముందే డిజిలాకర్ ద్వారా రీ-కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించింది. అలాగే దేశీయ, విదేశీ అభ్యర్థులకు పౌరసత్వం, ఆధార్ వివరాల ఎంపికలో ఎలాంటి గందరగోళం లేకుండా స్పష్టమైన మార్గదర్శకాలను కూడా ఎన్టీఏ జారీచేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JEE Main | ఈ రాత్రి 12 గంటలకు ముగియనున్న గడువు.. ఇప్పటికే 13 లక్షలు దాటిన జేఈఈ దరఖాస్తులు..!
Health tips | మీలో ఈ లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోండి..!
KTR | ఒకాయన అమిత్ షా ఎప్పుడు చెప్పులు విప్పుతాడా అని ఎదురు చేస్తాడు..! ఇంకొకాయన బాడీ గార్డులా మారిపోతాడు
KTR | రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అంటే అది కాదు..! ఫ్యూచర్ ఉన్న సిటీ మన వరంగల్
Boyfriend Stabs Girl | ఇతర అబ్బాయిలతో మాట్లాడుతున్నదని.. యువతిని చంపిన ప్రియుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

