Nepal PM Balen Shah | భారత్ చేరుకున్న నేపాల్ ప్రధాని.. సోమవారం ప్రధాని మోదీతో చర్చలు
Nepal PM Balen Shah | నేపాల్ ప్రధాని బాలెన్ షా తొలి పర్యటనలో భాగంగా ఆదివారం భారత్ చేరుకున్నారు. వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు స్వాగతం పలికారు.
న్యూఢిల్లీ: నేపాల్ ప్రధాని బాలెన్ షా తొలి పర్యటనలో భాగంగా ఆదివారం భారత్ చేరుకున్నారు. వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు స్వాగతం పలికారు. (Nepal PM Balen Shah) సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని బాలెన్ షా సమావేశం కానున్నారు. ఇంధనం, జలవిద్యుత్, రైల్వేలు, కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల రంగాలతో పాటు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరుగనున్నాయి.
కాగా, నేపాల్‌లో పలు ప్రాజెక్టులను ఇరు దేశాల ప్రధానమంత్రులు వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. అలాగే ఆర్థికవృద్ధి, సామాజిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, సాంకేతిక పరిజ్ఞానం, ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పు వంటి సమస్యలను పరిష్కరించడం వంటి అంశాలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తున్నది. భారతదేశం నేపాల్‌కు అతిపెద్ద వాణిజ్య, రవాణా, పెట్టుబడి భాగస్వామి ఉన్నది. భారత మార్కెట్లోకి పన్ను రహిత ప్రవేశాన్ని కూడా ఆ దేశం పొందుతున్నది.
మరోవైపు నేపాల్, భారత్ మధ్య చాలా కాలంగా సరిహద్దు వివాదం కూడా ఉన్నది. లిపులేఖ్, లింపియాధురా, కాలాపాని ప్రాంతాలు ఉత్తరాఖండ్‌లో భాగమని భారత్ స్థిరంగా వాదిస్తున్నది. మే నెలలో నేపాల్ ప్రధాని బాలెన్ షా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి చైనా, బ్రిటన్ దేశాల ప్రమేయాన్ని ఆయన కోరారు.
అయితే మూడో పక్షాల పాత్రను భారత్ తిరస్కరించింది. సరిహద్దు సమస్యకు సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరించుకోవడానికి ఇరు దేశాల మధ్య ఒక సుస్థిరమైన ద్వైపాక్షిక యంత్రాంగం ఉన్నదని పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Balen Shah
- first
- India
- Nepal PM
RELATED ARTICLES
తాజా వార్తలు
Nepal PM Balen Shah | భారత్ చేరుకున్న నేపాల్ ప్రధాని.. సోమవారం ప్రధాని మోదీతో చర్చలు
Festivals | పండుగల సమయంలో స్వీట్లను ఎక్కువగా తింటే షుగర్ లెవల్స్ ఎప్పటికీ అలాగే ఉంటాయా..?
JEE Main | ఈ రాత్రి 12 గంటలకు ముగియనున్న గడువు.. ఇప్పటికే 13 లక్షలు దాటిన జేఈఈ దరఖాస్తులు..!
Health tips | మీలో ఈ లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోండి..!
KTR | ఒకాయన అమిత్ షా ఎప్పుడు చెప్పులు విప్పుతాడా అని ఎదురు చేస్తాడు..! ఇంకొకాయన బాడీ గార్డులా మారిపోతాడు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

