లక్నో: వంతెనపై వెళ్తున్న మినీ లారీని బొలేరో వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. అదుపుతప్పిన అది పల్టీలు కొట్టింది. అయితే అనూహ్యంగా యథాస్థితికి వచ్చింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Bolero Collides With Truck) ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. శనివారం ఉదయం 6.15 గంటల సమయంలో వారణాసి నుంచి వస్తున్న బొలేరో వాహనం మజ్‌గవాన్ ఫ్లైఓవర్‌పై వేగంగా దూసుకొచ్చింది. ముందు వెళ్తున్న మినీ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
కాగా, ఈ సంఘటన నేపథ్యంలో బొలేరో వాహనం అదుపుతప్పింది. ఫ్లైఓవర్‌పై అది పల్టీలు కొట్టింది. అయితే అనూహ్యంగా తిరిగి యథాస్థితిలో ఆ వాహనం నిలిచింది. కేవలం ఆరు సెకన్లలో ఇది జరిగింది. అనంతరం బొలేరో వాహనం డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. మినీ లారీలోని లోడ్ వస్తువులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి.
మరోవైపు ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఫ్లైఓవర్‌పై నిలిచిన ఉన్న రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Gorakhpur 🚨⚠️ CCTV 6:15am
Bolero NEO rearends overloaded Tata Ace…
Bolero Driver Drowsy or Distracted?@DriveSmart_IN @dabir @InfraEye pic.twitter.com/iflanmzQ31
— Dave (Road Safety: City & Highways) (@motordave2) November 22, 2025
Also Read:
Man Kills Younger Brother | తమ్ముడి నేర ప్రవర్తన సహించలేక.. హత్య చేసిన అన్న
Sensitive Naval Data Leaked To Pak | నేవీ కీలక సమాచారం పాక్‌కు లీక్.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
Watch: కదులుతున్న రైలులో నూడుల్స్ వండిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?