ధర్మసాగర్ : గ్రామాభివృద్ధియే లక్ష్యంగా కృషి చేస్తున్నామని సర్పంచ్ పుట్ట రేణుక తెలిపారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని నారాయణగిరి గ్రామంలో సోమవారం పలు అభివృద్ధి పనులను సర్పంచ్ పుట్ట రేణుక ప్రారంభించారు. జీ రామ్ జీ పథకం నుంచి గ్రామ అభివృద్ధి కోసం మంజూరైన సుమారు రూ.25 లక్షలతో అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు.
ఈ సందర్భంగా త్వరితగతిన గ్రామంలోని పలు వీధులలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయనున్నట్లు ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వల్లపురెడ్డి సంధ్య రాజిమ్మ రెడ్డి, పీఆర్ ఏఈ నిఖిల్, వార్డు సభ్యులు రాజ్ కుమార్, ఈర్ల సంధ్య, దాసరి రాజ్ కుమార్, నాయకులు రమేష్, రాజయ్య, కరుణాకర్, వెంకటయ్య పాల్గొన్నారు.