Prithvi Shaw | ప్రేయసితో నిశ్చితార్ధం.. ‘నా పర్ఫెక్ట్ ఇన్నింగ్స్’ అంటున్న భారత క్రికెటర్..!
Prithvi Shaw : భారత జట్టుకు దూరమైనా.. దేశవాళీలో మెరుస్తున్న పృథ్వీ షా (Prithvi Shaw) త్వరలోనే ఇంటివాడు కాబోతున్నాడు. కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో ఆదివారం షా ఎంగేజ్మెంట్ వైభవంగా జరిగింది.
Prithvi Shaw : భారత జట్టుకు దూరమైనా.. దేశవాళీలో మెరుస్తున్న పృథ్వీ షా (Prithvi Shaw) త్వరలోనే ఇంటివాడు కాబోతున్నాడు. కొన్ని రోజులుగా ఇన్ఫ్లుయెన్సర్ ఆకృతి అగర్వాల్ (Akriti Agarwal)తో ప్రేమలో మునిగి తేలుతున్న ఈ డాషింగ్ బ్యాటర్ నిశ్చితార్థం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో ఆదివారం వీరిద్దరి ఎంగేజ్మెంట్ వైభవంగా జరిగింది. సినిమా నటి అయిన ఆకృతికి ఉంగురం తొడిగిన ఫొటలోను ఈ డాషింగ్ బ్యాటర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. నా పర్ఫెక్ట్ ఇన్నింగ్స్ అనే క్యాప్సన్ జోడించాడు షా.
ఇటీవల కాలంలో ఆటకంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచిన పృథ్వీ షా ఎంగేజ్మెంట్ ఫొటోలతో మరోసారి నెట్టింట వైరలవుతున్నాడు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆకృతి అగర్వాల్‌తో పలు సందర్భాల్లో కెమెరా కంటపడిన షా.. ఎట్టకేలకు తమ బంధాన్ని బహిర్గతం చేశాడు. తాజాగా సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ పెళ్లితో జంటగా తళుక్కమన్న ఆకృతి, పృథ్వీ షా ఆదివారం నిశ్చితార్థంతో పెళ్లికి వేళైందని సిగ్నల్ ఇచ్చారు.
లేత నీలం రంగు షేర్వానీలో షా మెరిసిపోగా.. ఎర్రని డిజైనర్ లెహెంగా ధరించిన ఆకృతి దేవకన్యలా వయ్యారాలు పోయింది. ఈమధ్యే త్రిముఖ సినిమాతో బాలీవుడ్లో అరంగేట్రం చేసిన ఆకృతిని ఇన్‌స్టాగ్రామ్‌లో 30 లక్షల మందికి పైగా అనుసరిస్తున్నారు.
జూనియర్ స్థాయిలో సంచలన ఆటతో మరో సచిన్ టెండూల్కర్‌గా ప్రశంసలందుకున్న పృథ్వీ షా.. ఊహించని విధంగా పాతాళానికి పడిపోయాడు. క్రమశిక్షణ కరువై, ఫిట్నెస్, ఫామ్ కోల్పోవడంతో అతడి కెరీర్ ప్రశ్నార్ధకంగా మారింది. ఐపీఎల్‌లోనూ నిరాశపరిచిన షా.. ఎట్టకేలకు దేశవాళీ సీజన్ 2025-26తో టచ్‌లోకి వచ్చాడు. ముంబై నుంచి మహారాష్ట్ర జట్టుకు మారిన అతడు.. పరుగుల వరదతో లయ అందుకున్నాడు. దాంతో.. ఐపీఎల్ 19వ సీజన్ మినీ వేలంలో షాను కనీస ధరకే ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitlals) దక్కించుకుంది.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
Japan | జపాన్‌లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

