IPL 2026 | ఐపీఎల్ షెడ్యూల్ మరింత వెనక్కి.. మార్చి 26న కాదు 28న టోర్నీ షురూ..!
IPL 2026 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ తేదీపై ఉత్కంఠ కొనసాగుతోంది. అబూధాబీలో వేలం ముగిసి మూడు నెలలు కావొస్తున్నా ఇంకా బీసీసీఐ నుంచి షెడ్యూల్ ప్రకటన రాలేదు.
IPL 2026 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ తేదీపై ఉత్కంఠ కొనసాగుతోంది. అబూధాబీలో వేలం ముగిసి మూడు నెలలు కావొస్తున్నా ఇంకా బీసీసీఐ నుంచి షెడ్యూల్ ప్రకటన రాలేదు. ఆనవాయితీ ప్రకారం మార్చి – మే నెల మధ్యలో మెగా టోర్నీ జరగాలి. ఈసారి కూడా అదే సంప్రదాయం పాటించే అవకాశముంది. అయితే.. ఇదివకూ చెప్పినట్టు మార్చి 26న కాకుండా మరో రెండు రోజులు ఆలస్యంగా మెగాటోర్నీ ప్రారంభమవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
త్వరలోనే నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలోనే ఐపీఎల్ 19వ సీజన్ షెడ్యూల్ ప్రకటన ఆలస్యం అవుతోంది. కేరళ, అస్సాం, బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా సీజన్ ఆరంభంపై బీసీసీఐ ఆలోచనలో పడింది. ఆ రాష్ట్రాల్లో ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం తేదీలు ప్రకటించగానే.. ఐపీఎల్ తేదీలను ఖరారు చేయాలని బీసీసీఐ భావిస్తోంది. 2019లోలోనూ ఇదే సమస్య ఎదురైంది. అప్పుడు పూర్తి స్థాయిలో కాకుండా కొన్ని మ్యాచ్లకే షెడ్యూల్ వెల్లడించింది.
The IPL 2026 season is set to begin on March 28, following a slight delay due to pending election dates in key states. The IPL Governing Council will finalize the schedule soon, addressing logistical and safety concerns, especially for RCB’s home games.https://t.co/mIZzULg03b pic.twitter.com/VrB0H7218x
— Gulf News (@gulf_news) February 27, 2026
ఈసారి కూడా అదే పంథాను అనుసరించాలని బీసీసీఐ కసరత్తు చేస్తోంది. అయితే.. వేలం సందర్భంగా చూచాయగా పేర్కొన్నట్టు మార్చి 26వ తేదీన కాకుండా.. మరో రెండు రోజులు ఆలస్యంగా టోర్నీ షురూ కానుంది. అంటే.. అంటే మార్చి 28న వేసవి వినోదంగా ఐపీఎల్ సందడి మొదలవ్వనుంది. ఒకవేళ.. ఈ రోజున కాదంటే.. మార్చి 29. ఈ రెండు తేదీల్లో ఒకటి ఖరారు అవుతుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

