రాష్ట్ర కాంగ్రెస్‌పై ‘ఢీ’సీసీలు ఫైర్!
కాంగ్రెస్‌లో అసంతృప్తి ఒక్కసారి భగ్గుమన్నది. ప్రభుత్వ అధినేత, మంత్రులు, ఎమ్మెల్యేల మీద డీసీసీ అధ్యక్షులు తిరుగుబావుటా ఎగురవేశారు. తమకు తగిన గుర్తింపు, గౌరవం దకడం లేదనే ఆవేదనతో ఏకంగా 25 మంది కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సోమవారం హైదరాబాద్‌లోని ఫతేమైదాన్ క్లబ్లో రహస్యంగా సమావేశమయ్యారు.
- కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల రహస్య భేటీ
- ప్రొటోకాల్ దక్కట్లేదని అసంతృప్తి
- పార్టీ కార్యక్రమాలకూ ఆహ్వానిస ్తలేరు
- ఏఐసీసీ ఇన్చార్జి సందీప్‌కు ఫిర్యాదు
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్‌లో అసంతృప్తి ఒక్కసారి భగ్గుమన్నది. ప్రభుత్వ అధినేత, మంత్రులు, ఎమ్మెల్యేల మీద డీసీసీ అధ్యక్షులు తిరుగుబావుటా ఎగురవేశారు. తమకు తగిన గుర్తింపు, గౌరవం దకడం లేదనే ఆవేదనతో ఏకంగా 25 మంది కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సోమవారం హైదరాబాద్‌లోని ఫతేమైదాన్ క్లబ్లో రహస్యంగా సమావేశమయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. పార్టీ పదవులు చేపట్టి ఏడాది కావస్తున్నా కనీస ప్రొటోకాల్ లేదని, పార్టీ కార్యక్రమాలకు కూడా ఆహ్వానించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతా కలిసి ఏఐసీసీ ఇన్చార్జి బీఎం సందీప్ ఎదుట గళం విప్పారు. తమను దూరం పెడుతున్న తీరుపై ఫిర్యాదు చేశారు.
ఇన్చార్జికి ఫిర్యాదుకాంగ్రెస్ అధిష్ఠానం 2025 నవంబర్ 22న తెలంగాణలో డీసీసీ అధ్యక్షులను నియమించింది. సంఘటన్ సృజన్ అభియాన్‌లో భాగంగా చేపట్టిన ఈ నియామకాలతో జిల్లాల్లో పార్టీ సంస్థాగత వ్యవస్థను బలోపేతం చేయాలని భావించింది.
అయితే నియామకమై ఏడాది కావస్తున్నా క్షేత్రస్థాయిలో తమకు తగిన గుర్తింపు లభించడం లేదని అధ్యక్షులు భావిస్తున్నట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఏఐసీసీ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన బీఎం సందీప్ రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని సమీక్షిస్తున్న సమయంలోనే డీసీసీ అధ్యక్షులు తమ అసంతృప్తిని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. డీసీసీ అధ్యక్షుల ఫోరం తరఫున 25 మంది కలిసి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. డీసీసీ అధ్యక్షులుగా నియామకమైనప్పటి నుంచీ జిల్లాల్లో ఎదురవుతున్న పరిస్థితులను వారు ఈ సమావేశంలో ఏకరువు పెట్టినట్టు తెలిసింది. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు తమకు సమాచారం ఇవ్వడం లేదని, కనీసం ఆహ్వానించడం లేదని పలువురు అధ్యక్షులు ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోనే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా డీసీసీ అధ్యక్షులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. జిల్లాల్లో పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం సాధించాల్సిన బాధ్యత తమపై ఉన్నా ప్రజాప్రతినిధుల నుంచి సహకారం కొరవడుతున్నదని వాపోయినట్టు సమాచారం.
కమిటీలకు చైర్ పర్సన్లుగా నియమించాలంటూ వినతి
ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంలో భాగంగా, కర్ణాటకలో అమలవుతున్న విధానం తరహాలో, సంబంధిత కాంగ్రెస్ జిల్లా కమిటీ అధ్యక్షులను జిల్లా స్థాయి ప్రభుత్వ పథకాల అమలు కమిటీలకు చైర్ పర్సన్లుగా నియమించేందుకు సిఫారసు చేయాలని డీసీసీ అధ్యక్షులు వినతి పత్రం ఇచ్చినట్టు తెలిసింది. తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య విభేదాలు, నియోజకవర్గాల్లో నిధులు, ప్రాధాన్యత, పార్టీ నాయకత్వం వంటి అంశాలపై అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో జిల్లాల్లో పార్టీకి నాయకత్వం వహించే డీసీసీ అధ్యక్షులే గళం విప్పడం అధిష్ఠానానికి కొత్త తలనొప్పిగా మారే అవకాశం ఉన్నది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సంస్థాగత బాధ్యతలు నిర్వహిస్తున్న అధ్యక్షులకు మధ్య సమన్వయం అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

