Bengaluru Traffic | బెంగళూరులో ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడూ ఇక్కడ వాహనాల రద్దీ కనిపిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ట్రాఫిక్ నుంచి తప్పించుకుని తక్కువ టైమ్‌లో ఇంటికి వెళ్లేందుకు ఓ మహిళ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
బెంగళూరుకు చెందిన శ్రావికా జైన్ అనే మహిళ ట్రాఫిక్ సమస్యపై తన అనుభవాన్ని తాజాగా సోషల్‌మీడియాలో పంచుకుంది. 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన గమ్యస్థానానికి వెళ్లేందుకు 47 కిలోమీటర్ల మార్గాన్ని ఎంచుకున్నట్లుగా తెలిపింది. భారీ ట్రాఫిక్‌ను తప్పించుకునేందుకే తాను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అందులో వివరించింది. ట్రాఫిక్‌ను తప్పించుకోవడానికి ఇలా ఎక్కువ దూరం ఉన్న రూట్‌ను ఎంచుకోవడం బెంగళూరులో సాధారణ విషయమేనని పేర్కొంది. తన నిర్ణయాన్ని వివరించేందుకు రెండు నావిగేషన్ మ్యాప్ స్క్రీన్షాట్లను కూడా శ్రావికా షేర్ చేసింది. దాదాపు రెండింతల దూరం ప్రయాణించినప్పటికీ.. తక్కువ సమయంలోనే గమ్యస్థానాన్ని చేరుకోవచ్చని పేర్కొంది. ఈ పోస్టు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
Took the 47km route instead of 23km to avoid traffic in Bengaluru
Regular day 🙂 pic.twitter.com/53Y4eaINmU
— Shravika Jain (@shravi_aj) March 5, 2026
ఈ పోస్టుపై పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో పంచుకున్నారు. ప్రతి రోజూ నేను ఇలాగే చేస్తాను అని కామెంట్ చేశారు. భవిష్యత్తులో బెంగళూరు సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ పూర్తిగా నిలిచిపోవచ్చని మరో నెటిజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏదేమైనా ఈ పోస్టుతో బెంగళూరులో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య మరోసారి చర్చకు దారితీసింది.