Heavy Rains | రాష్ర్టానికి భారీ వర్ష సూచన.. మూడ్రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వాన
Heavy Rains | బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర ఒడిశా, గంగానది పశ్చిమబెంగాల్ ప్రాంతాలపై కేంద్రీకృతమై పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Heavy Rains | హైదారాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర ఒడిశా, గంగానది పశ్చిమబెంగాల్ ప్రాంతాలపై కేంద్రీకృతమై పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో మూడ్రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. అటు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఎల్ నినో కారణంగా జూన్, జూలైలో -49 సెం.మీ లోటు వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ గణాంకాలు వెల్లడించాయి. నిరుడు ఇదే సమయానికి 33.3 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో మెదక్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసినట్టు చెప్పారు.
ములుగు జిల్లా ఏటూరునాగారంలో అత్యధికంగా 9.64 సెం.మీ, మెదక్ జిల్లా చేగుంటలో 8.11 సెం.మీ, మెదక్‌లో 7.68 సెం.మీ, శంకరంపేటలో 6.71 సెం.మీ, జయశంకర్భూపాలపల్లి జిల్లా పాలెంలలో 6.90 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 6.14 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్టు వివరించారు. బుధవారం ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, గురు, శుక్రవారాల్లోనూ బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

