రేవంత్‌రెడ్డీ రాజీనామా చెయ్!
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలగించాలన్న హైకోర్టు నిర్ణయానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన పదవికి వెంటనే రాజీనామా చేసి, తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.
- బుల్డోజర్ పాలనపై కోర్టు సర్జికల్ ్రైస్టెక్
- దీనిలో అసలు నిందితుడు రేవంత్‌రెడ్డే!
- రంగనాథ్‌ను తక్షణమే తొలగించాలి
- ఆయన వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణే
- అప్రజాస్వామిక పాలనకు చెంపపెట్టు
- బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు
హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలగించాలన్న హైకోర్టు నిర్ణయానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన పదవికి వెంటనే రాజీనామా చేసి, తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు సీఎం అహంకారాన్ని బద్దలు కొట్టిందని, ఆయన ప్రభుత్వం సాగిస్తున్న రాక్షస పాలనపై ఇది చరిత్రాత్మకమని అభివర్ణించారు.
రేవంత్‌రెడ్డి బుల్డోజర్ రాజ్యాంగంపై హైకోర్టు వేసిన సర్జికల్ ్రైస్టెక్ లాంటిదని తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మంగళవారం మీడియాతో దాసోజు శ్రవణ్‌కుమార్ మాట్లాడారు. స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక ఐపీఎస్ అధికారిని కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించడం అత్యంత అరుదైన ఘటనగా పేరొన్నారు. హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా కమిషనర్ రంగనాథ్ మీడియా ముందుకొచ్చి కోర్టును తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం ముమ్మాటికీ కోర్టు ధికరణే అవుతుందని, హైకోర్టును ఒక ఐపీఎస్ అధికారి వేలెత్తి చూపే ధైర్యం చేస్తున్నాడంటే అది ఆయన వెనుక ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఆడించే నాటకమేనని ఆరోపించారు.
మున్సిపల్ శాఖ మంత్రిగా రేవంత్‌రెడ్డి ఇచ్చిన అక్రమ ఆదేశాలను అమలుచేస్తూ రంగనాథ్ ఒక సాధనంగా మారారని విమర్శించారు. ‘తోలుబొమ్మ రంగనాథ్ అయితే, ఆడించేటోడు రేవంత్‌రెడ్డి.. వీళ్లిద్దరూ ముమ్మాటికీ నిందితులే’ అని ఆరోపించారు. హైకోర్టు ఉత్తర్వులు కేవలం ఒక అధికారికి పరిమితమైనవే కాదని.. అది రేవంత్‌రెడ్డి మున్సిపల్ పాలనపై, ఆయన బుల్డోజర్ రాజ్యాంగంపై కొట్టిన దెబ్బ అని చెప్పారు. ‘నేనే రాజు నేనే మంత్రి’ అని విర్రవీగుతూ, పేదల ఇండ్లను అర్ధరాత్రి వేళల్లో నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి శాడిస్టిక్ ఆనందం పొందారని మండిపడ్డారు. హైడ్రా శాడిస్టిక్ చేష్టలను ఆనందిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి చెంప చెళ్లుమనిపించేలా హైకోర్టు తీర్పు వచ్చిందని, మంత్రివర్గం మొత్తానికి కొరకాసు పడినట్లయిందని ఆయన విమర్శించారు.
పేదలపైనే విరుచుకుపడ్డ హైడ్రా
కొడంగల్ రెడ్డికుంటలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసం, దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఆయన సోదరుడి ఇల్లు, కొందరు మంత్రుల ఆస్తులు కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. వారి అక్రమ నిర్మాణాల వద్దకు వెళ్లేసరికి గుడ్డిదవుతున్న హైడ్రా.. తమ జీవితాంతం కష్టపడి ఇండ్లు కట్టుకొన్న పేద, మధ్యతరగతి ప్రజలపై బుల్డోజర్లు నడిపిందని మండిపడ్డారు. ఎంపిక చేసిన చోటే పేదల ఇండ్లను కూల్చుతున్న హైడ్రా.. ఎఫ్టీఎల్లో ఉన్న పెద్దల నిర్మాణాలను ఎందుకు కూల్చకుండా వదిలేసిందని ప్రశ్నించారు. ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ కాలేజీని ఎందుకు కూల్చలేదని ప్రశ్నించారు. మూసీ నది మధ్యలో ఆదిత్యా కన్స్ట్రక్షన్ నిర్మాణాలు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నదని నిలదీశారు. హైడ్రా భయంతో కూకట్పల్లి నియోజకవర్గంలో బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకొన్నదని, భూ కబ్జాకోరులకు పోలీసులు పూర్తిగా అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్రాచారి, బీఆర్ఎస్ నేత బొమ్మెర రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పక్షాన శ్రవణ్ లేవనెత్తిన
ప్రధాన డిమాండ్లు ఇవే..
- నైతిక బాధ్యతతో తక్షణమే సీఎం రాజీనామా: హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి అయిన రేవంత్‌రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి.
- బాధితులకు పూర్తి నష్టపరిహారం: నోటీసులు ఇవ్వకుండా, చట్టవిరుద్ధంగా చేపట్టిన కూల్చివేతల వల్ల జరిగిన ఆస్తుల నష్టానికి బాధిత కుటుంబాలకు ప్రభుత్వమే పూర్తి పరిహారం చెల్లించాలి.
- హైడ్రా కమిషనర్ తొలగింపు: న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టినందున కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను బాధ్యతల నుంచి తక్షణమే తప్పించాలి.
- పైకోర్టులకు అప్పీల్‌కు వెళ్లొద్దు: హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం పంతాలకు పోకుం డా, డివిజన్ బెంచ్‌కు గానీ, సుప్రీంకోర్టుకు గానీ అప్పీల్ చేయకుండా హైకోర్టు ఆదేశాలను గౌరవించాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

