లక్నో: మొబైల్ నెట్వర్క్ సమస్యలపై గ్రామస్తులు విసిగిపోయారు. ఆ గ్రామానికి చేరుకున్న టవర్ సిబ్బందిపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ వ్యక్తిని టవర్ స్తంభానికి కట్టేశారు. (villagers tie tower worker to pole) ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆ వ్యక్తిని విడిపించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హర్దౌలీ గ్రామంలో రెండేళ్ల కిందట ఒక టెలికాం సంస్థ మొబైల్ టవర్ ఏర్పాటు చేసింది. దీంతో తమ దీర్ఘకాలిక కనెక్టివిటీ సమస్యలు పరిష్కారమవుతాయని గ్రామస్తులు ఆశించారు.
కాగా, ఇటీవల మొబైల్ నెట్వర్క్ సేవల్లో అంతరాయాలు, సమస్యలు పెరిగాయి. దీంతో ఫోన్ కాల్స్ చేసుకోవడంలో, మొబైల్ ఇంటర్నెట్ను వినియోగించడంలో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో వారు ఆగ్రహంతో ఉన్నారు.
మరోవైపు గురువారం సాయంత్రం ఆ మొబైల్ టవర్ నిర్వహణ కోసం సిబ్బంది ఒకరు ఆ గ్రామానికి చేరుకున్నారు. దీంతో గ్రామస్తుల అసహనం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని వారు అడ్డుకున్నారు. టవర్‌కు ఉన్న ఒక స్తంభానికి అతడ్ని కట్టివేశారు. ఆ సిబ్బందిపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
అయితే ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఏం జరిగిందో అన్నది ఆరా తీశారు. నిరంతరం నెట్వర్క్ సమస్యలతో విసిగిపోయిన గ్రామస్తులు మొబైల్ టవర్ సిబ్బందిని స్తంభానికి కట్టివేసినట్లు తెలుసుకున్నారు. చివరకు అతడ్ని విడిపించారు. ఈ సంఘటనపై విచారణ చేపట్టారు. కొందరు వ్యక్తులు రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
फतेहपुर — मोबाइल पर 5G नेटवर्क न आने पर ग्रामीणों का फूटा गुस्सा।
टॉवर कर्मचारी को ग्रामीणों ने बनाया बंधक, 02 साल से नेटवर्क की समस्या से परेशान हैं ग्रामीण।
सूचना पर पहुंची पुलिस मामले की जांच पड़ताल में जुटी, बिंदकी कोतवाली क्षेत्र के हरदौली गांव का बताया जा रहा वायरल वीडियो pic.twitter.com/SJ8q8RlJBa
— Vineet G 🇮🇳 (@aapka_vineet) September 11, 2026