కోల్‌కతా: మెట్రోస్టేషన్లో ఇద్దరు మహిళా ప్రయాణికులు, లేడీ ఆర్పీఎఫ్ సిబ్బంది మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ నలుగురు మహిళలు జుట్లుపట్టుకుని నేలపైపడి కొట్టుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Women Passengers, RPF Personnel Grapple) పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 7న రాత్రి 10 గంటల సమయంలో భవానీపూర్లోని నేతాజీ భవన్ మెట్రో స్టేషన్‌కు ఇద్దరు మహిళలు చేరుకున్నారు. అక్కడ విధుల్లో ఉన్న మహిళా ఆర్పీఎఫ్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారు. మద్యం సేవించిన వాసన వారి నుంచి వచ్చిందని, మహిళా స్టేషన్ మాస్టర్‌పై కూడా వారు దాడి చేసినట్లు సిబ్బంది ఆరోపించారు.
కాగా, ఘర్షణ ముదరడంతో ఆ నలుగురు మహిళలు ఒకరి జుట్టు ఒకరు లాక్కుంటూ నేలపై పడి కొట్టుకున్నారు. వారి మధ్య పిడిగుద్దులు, చెంపదెబ్బలు, తోపులాటలతో అక్కడ గందరగోళం చెలరేగింది.
మెట్రో యూనిఫాం ధరించిన మరో మహిళ ఆ గొడవను ఆపేందుకు ప్రయత్నించింది. మహిళా ప్రయాణికులలో ఒకరిని ఒక వ్యక్తి పలుమార్లు కొట్టడం కూడా కనిపించింది.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న భవానీపూర్ స్టేషన్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ ఇద్దరు మహిళల కుటుంబ సభ్యులు కూడా అక్కడకు వచ్చారు. లిఖితపూర్వక క్షమాపణ పత్రాన్ని ఆ మహిళలు ఇవ్వడంతో ఈ వివాదం సద్దుమణిగింది. విధుల్లో ఉన్న సిబ్బందితో దురుసుగా ప్రవర్తించినందుకు ఆ ఇద్దరు మహిళా ప్రయాణికులకు వెయ్యి చొప్పున జరిమానా కూడా విధించారు. అయితే ఆ మహిళలు, లేడీ ఆర్పీఎఫ్ సిబ్బంది మధ్య జరిగిన ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Two female passengers beat a woman police officer at Netaji Bhawan Metro Station.
They had entered the station and started misbehaving with on-duty staff.
Both women were fined ₹1,000 each. pic.twitter.com/kpw0tMb9OR
— Gems Of Railway (@GemsOfRailway) September 10, 2026