Hanuman Ansh | ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవితాధారంగా తెరకెక్కిన సంచలన హిందీ భక్తిరస చిత్రం ‘హనుమాన్ అంశ్’ (Hanuman Ansh) ఇప్పుడు అధికారికంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా కేవలం రూ.2 కోట్ల చిన్న బడ్జెట్తో విడుదలై, బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల రూపాయలకు పైగా వసూళ్లతో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి.
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెలుగులో సమర్పిస్తుండగా, ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంస్థ తెలుగు థియేట్రికల్ విడుదలను చేపట్టింది. విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభినావ్ సత్య, విహాన్ శెడ్గే ప్రధాన పాత్రల్లో నటించారు. నీమ్ కరోలి బాబా భక్తుల భావోద్వేగాలను, ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను అద్భుతంగా ఆవిష్కరించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 18న అత్యంత భారీ స్థాయిలో తెలుగు తెరపైకి రానుంది.
#HanumanAnsh is now coming to Telugu! 🙌🏻
Presented by #TrivikramSrinivas
Telugu Theatrical Release by @Fortune4CinemasGrand Release in Telugu on September 18th! 🔥#ShobhinawSatyaa #VihaanShedge pic.twitter.com/cBWgu2QA99
— Suresh PRO (@SureshPRO_) September 11, 2026