ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకునేడు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పట్టణ పరిధిలోని కొత్త బస్టాండ్ నుంచి అంబేద్కర్, నేతన్న చౌక్ మీదుగా రగుడు జంక్షన్ వరకు ఎలాంటి వాహనాలను అనుమతించబోమని వెల్లడించారు. వాహనదారులు పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించి సహకరించాలని డీఎస్పీ నాగేంద్రచారి సూచించారు.
కరీంనగర్, వేములవాడ నుంచి సిరిసిల్లకు వచ్చే వాహనదారులు రగుడు జంక్షన్ నుంచి రెండో బైపాస్ మీదుగా వెంకటాపూర్ నుంచి సిరిసిల్లకు చేరుకోవాలని సూచించారు. లేదా మొదటి బైపాస్ మీదుగా ఎల్లమ్మ సర్కిల్ నుంచి సిరిసిల్లకు చేరుకోవచ్చని తెలిపారు.
కరీంనగర్, వేములవాడ నుంచి ఎల్లారెడ్డిపేట, కామారెడ్డి వైపు వెళ్లే వాహనదారులు రగుడు జంక్షన్ నుంచి రెండో బైపాస్ మీదుగా వెంకటాపూర్ వైపు వెళ్లాలని పోలీసులు సూచించారు.
వేములవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులు మొదటి బైపాస్ మీదుగా ఎల్లమ్మ సర్కిల్ వైపు వెళ్లాలని డీఎస్పీ నాగేంద్రచారి సూచించారు. ముఖ్యమంత్రి పర్యటన పూర్తయ్యే వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని పోలీసులకు సహకరించాలని కోరారు.