బాలీవుడ్ ప్రముఖ నటుడు రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రహార్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఉజ్వల్ నికమ్’ (Prahaar: The Untold Story of Ujjwal Nikam). దేశాన్ని షాక్‌కి గురిచేసిన ముంబై ఉగ్రరూప దాడుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ట్రైలర్ తాజాగా విడుదలైంది. దేశం గర్వించదగ్గ ప్రముఖ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ముఖ్యంగా 26/11 ముంబై ఉగ్రదాడి సమయంలో అజ్మల్ కసబ్ కేసుకు సంబంధించి ఆయన చేపట్టిన సాహసోపేతమైన వాదనలు, కోర్టు రూమ్ డ్రామా మరియు ఆయన వ్యక్తిగత జీవితంలోని ముఖ్య ఘట్టాలను ఈ చిత్రంలో చూపించనున్నారు.
ఈ బయోపిక్‌లో ఉజ్వల్ నికమ్ పాత్రలో టాలెంటెడ్ యాక్టర్ రాజ్ కుమార్ రావు తన నటనతో మెప్పించనున్నారు. ఆయన సరసన వామికా గబ్బి ప్రధాన పాత్రలో నటిస్తుండగా, జైదీప్ అహ్లావత్, సికందర్ ఖేర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అవినాష్ అరుణ్ ధవారే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాడాక్ ఫిల్మ్స్ (Maddock Films) పతాకంపై దినేష్ విజన్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 16, 2026 న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.