Sircilla | అయ్యా! ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారు.. 2018 అసెంబ్లీ ఎన్నికల సమ యంలో మీరు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మా కార్మిక క్షేత్రానికి వచ్చారు. 2018 నవంబర్ 26న సిరిసిల్ల నడిబొడ్డున ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడారు. సిరిసిల్లను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. మాతో జేజేలు కొట్టించారు. ఇప్పటికీ ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవు తూనే ఉన్నది. మీరు మరిచిపోయినా, మేం మరిచిపోలేదు. ఆనాడు మీరు దత్తత తీసుకుంటామని చెప్పిన మాటల్లో చిత్తశుద్ధి లేదని ఇప్పుడు మేం శంకించక తప్పడం లేదు. మీరు చెప్పిన మాటలు నిజమే అయితే.. మీరు సీఎం అయి మూడేళ్లు అవుతున్నా గుర్తుకు రాలేదా..? మా కార్మిక క్షేత్రానికి వచ్చిపోయే సమయం ఒక్కసారైనా మీకు దొరకలేదా..? లేక అన్ని హామీల మాదిరిగానే దత్తత అంశాన్ని కూడా మరిచిపోయారా..? అంటే అధికారంలోకి రాగానే మమ్మల్ని మరిచిపోయారని మేం భావించాల్సి వస్తున్నది. దత్తత తీసు కుంటున్నట్టు చెప్పిన సుమారు ఎనిమిదేండ్ల తర్వాత మా గడ్డపై అడుగుపెడు తున్నారంటే.. మా ప్రాంతంపై, సిరిసిల్ల ప్రజల సంక్షేమంపై మీ చిత్తశుద్ధి, నిజాయితీ ఏమేరకు ఉన్నదో అర్థమవుతున్నది. అయినా సరే.. ఇన్నాళ్లకు గుర్తుకు తెచ్చుకొని, మా కార్మికక్షేతం గడ్డపై ముఖ్యమంత్రి
మీరు సీఎం అయిన మూడేళ్ల తర్వాతనైనా మేం గుర్తుకు వచ్చినందుకు సంతోషం! సరిగ్గా రెండేళ్ల క్రితం 2024 నవంబర్‌లో వేములవాడకు వచ్చి వెళ్లారరే తప్ప కార్మికక్షేత్రమైన సిరిసిల్లకు రాలేదు. ఈ సభ ద్వారా అయినా మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో నెలకొన్న సమస్యలకు పరి ష్కారం చూపుతారని ఆశిస్తున్నాం. సిరిసిల్ల అనగానే వస్త్ర పరిశ్రమ గుర్తుకువ స్తుంది. అందుకే మా సమస్యలను ఇక్కడి నుంచే మొదలు పెడుతున్నాం. అధి కారంలోకి రాక ముందు ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. అవి మీకు గుర్తున్నాయో లేదో తెలియదు కానీ, మా మనసుల్లో మాత్రం పదిలంగా ఉన్నాయి. ఎందు కంటే మీ మాటలు నమ్మి ఓటేసిన వాళ్లం కదా! ఆ బాధ మాకే ఉంటుంది. మూడేళ్ల మీ పాలనలో 35 మంది మా నేతన్నల ప్రాణాలు గాల్లో కలిశాయి. వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దీనికి కారణాలు ఏంటని ఏ ఒక్క రోజు మీరు ఆలోచించలేదు. కనీసం సమీక్ష చేయలేదు. ఆదుకునేందుకు ఆదే శాలు ఇవ్వలేదు. ఒక్క మాట మాత్రం గట్టిగా చెబుతున్నాం. ఇదంతా మీ సర్కారు పుణ్యమే!
ఇలా చెప్తే.. మాకేమి సంబంధం అంటూ దాటవేస్తారు. అందుకే మీకు ఆధారాలతో సహా చెబుతున్నాం. నేతన్నలకు పని కల్పిస్తామన్న మీరు, అధి కారంలోకి రాగానే మాకు బతుకునిచ్చిన బతుకమ్మ చీరెల ఆర్డర్లు నిలిపివేశారు. 2017లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు బతుకునిచ్చేందుకు బతుకమ్మ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ప్రతి సంవత్సరం కోటి చీరెలు పంపిణీ చేసి.. మాకు చేతినిండా పని కల్పించి మా జీవితాల్లో వెలుగులు నింపారు. అక్కడితో ఆగకుండా స్కూల్ యూనిఫాంలు, కేసీఆర్ కిట్, రంజాన్, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్‌లు, సంక్షేమ శాఖ వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లతోపాటు అనేక ప్రభుత్వ ఆర్డర్లను సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు అందించారు. కేసీఆర్ పాల నలో రూ.3,313 కోట్ల విలువైన 100 కోట్ల మీటర్ల బట్టకు పీపీ ఆర్డర్లు ఇచ్చి మా జీవనోపాధికి భరోసా ఇచ్చారు. దీంతో ఆత్మహత్యలు, వలసలు తగ్గి ఇక మా జీవితాలు బాగుపడ్డాయి అనుకున్న సమయంలో మీ కాంగ్రెస్ సర్కారు వచ్చింది. ఎన్నికల్లో చెప్పినట్టు మీరు మరింత భరోసా ఇస్తారని భావించాం. కానీ, వచ్చీ రాగానే 2024లో బతుకమ్మ చీరెల ఆర్డర్లను నిలిపేసి మా పొట్ట మీద కొట్టారు. చివరకు మా పోరాటం మేరకు చేనేత పరిశ్రమను ప్రోత్సహి స్తున్నట్టు ప్రకటించి జీవో ఎంఎస్ నం
నేతన్నలపై మీ కక్షసాధింపు ఇంకా కొనసాగుతూనే ఉన్నది. అందుకే.. మీ ముందు కొన్ని డిమాండ్లు పెడుతున్నాం. గతంలో బీఆర్ఎస్ సర్కారు ఇచ్చి నట్టు అన్ని ఆర్డర్లు మాకే ఇవ్వాలి. మీ సర్కారు జారీ చేసిన జీవో నంబర్ 1ని యధావిధిగా అమలు చేయాలి. కార్మికులకు యారన్ సబ్సిడీ ఇవ్వాలి. అనాలో చిత నిర్ణయంతో వేములవాడలో పెట్టిన నూలు డిపోను సిరిసిల్లకు మార్చాలి. జీఎస్టీ అదనపు భారాన్ని సర్కారు భరించాలి. బీఆర్ఎస్ అప్ డేషన్ చేసినవి పోను మిగిలిన మరమగ్గాలను ఆధునీకరించాలి. అపరెల్ పార్క్ కొత్త పరిశ్ర మలు ఏర్పాటు చేసి మా బిడ్డలకు ఉపాధి కల్పించాలి. వర్కర్ టూ ఓనర్ పథ కాన్ని అమల్లోకి తేవాలి. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో పెరిగిన యారన్, రసాయనాల ధరలకు అనుగుణంగా వస్త్ర ఉత్పత్తి చార్జీలు పెంచాలి. పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలి. వీటితోపాటు మరికొన్ని డిమాండ్లను ఇప్ప టికే మీ నాయకులకు అందించాం. వీటి విషయంలో మీ స్పందన కోసం చూస్తున్నాం. ఉత్త మాటలు, ఉత్తి చేతులు, విమర్శలు కాదు.. మాకు సమ స్యల పరిష్కారం కావాలి. నేడు జరిగే బహిరంగ సభా వేదికపై మీరు వీటికి సమాధానాలు చెప్తారని ఆశిస్తున్నాం.
సమైక్య రాష్ట్రంలో మెట్టప్రాంతంగా మేం ఇబ్బంది పడ్డాం. ఆనాటి రాష్ట్రంలో ఎక్కడ కరువు మండలాలు ప్రకటించినా అందులో మా తొమ్మిది మండలాలు ఉండేవి. బావులు, బోర్లపై ఆధారపడిన మా జీవితాలపై ఏనాడూ ఆనాటి సమైక్య రాష్ట్రాలు దృష్టిపెట్టలేదు. అందుకే ఆనాడు ఎక్కువ రైతుల ఆత్మహత్యలు ఇక్కడే జరిగాయి. ప్రాణహిత-చేవెళ్ల నీళ్లు తెచ్చి నింపుతా మంటూ ఆనాటి మీ సర్కారు 2008లో పైలాన్ వేస్తే మా బాధలు తొలుగు తాయనుకున్నాం. కానీ, ఆనాటి కాంగ్రెస్ సర్కారు వేసిన పైలాన్ కూలిపో యిందే తప్ప చుక్క నీరు రాలేదు. ఈ పరిస్థితుల్లో వచ్చిన కేసీఆర్ సర్కారు పదేళ్లలో వ్యవసాయరంగ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేసిందని గర్వంగా చెబుతున్నాం. నెర్రెలు బారిన నేలలు, నోళ్లు తెరిచిన బావులు, అడుగంటిన భూగర్భజలాలు, అడుగడుగునా కరువుతో అల్లాడిన రాజన్న సిరిసిల్ల జిల్లాను సస్యశ్యామలంగా మార్చారు. ఇలా నిజం చెప్తే మీకు ఎక్కడో కలుక్కుమం టుంది. కానీ, ఫలాలు అనుభవించిన మేం చెప్పకుండా ఉండలేకపోతున్నాం. మధ్యమానేరు, మల్కపేట జలాశయం, అన్నపూర్ణ జలాశయం, మానేరు వాగు, మూలవాగులపై చెక్ డ్యాంల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ, ఎల్లం పల్లి నుంచి ఎత్తిపోతలు, కాళేశ్వరం ప్యాకేజీ 9, 10, 11, 12 గ్రావిటీ కాలు వల ద
ఇక మీ మూడేళ్ల పాలనలో మళ్లీ వ్యవసాయరంగం కుదేలవుతు న్నది. ఈ సీజన్లో పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది. మళ్లీ భూగ ర్భజలాలు పడిపోయాయి. చెరువులు ఎండిపోయాయి. బావుల్లో ఉన్న నీళ్లు పారించుకుందామంటే కరెంటు ఆరేడు గంటలకు మించి ఉంటలేదు. అది కూడా నాణ్యంగా రావడం లేదు. మోటర్లు కాలిపోతున్నాయి. పంటలు ఎండిపోయే ప్రమాదం ఉన్నది. అందుకే సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాలకు సాగు నీరు ఎప్పటి నుంచి ఇస్తారో ఈ బహిరంగ సభా వేదికగా చెప్పా లని కోరుతున్నాం. అలా కాకుంటే పెట్టుబడులు మీదపడి మళ్లీ మా జీవితాలు ఆగమవుతాయని ఆవేదన చెందుతున్నాం. బకాయి పడిన రైతుబంధు గురించి చెప్పండి. ఏ కారణంతోనైనా సరే మా రైతు బిడ్డ చనిపోతే.. గుంటెడు భూమిఉన్నా రూ.5 లక్షల బీమా సొమ్ము పది రోజుల్లో ఇంటికి వచ్చేలా కేసీఆర్ చేశారు. దానికి మీరు రాంరాం చెప్పారు. మీరు ఆపేసిన సమయంలో సుమారు 27 మందికి పైగా రైతులు చనిపోయారు. వారి కుటుంబాలకు ఆధారం లేకుండా పోయింది. దీనిపై స్పష్టత ఇవ్వాలి. రైతు బీమా పథకం కొనసాగిస్తారా.. లేదా? చెప్పాలి.
దక్షిణ కాశీగా పిలువబడే మా వేములవాడ రాజన్న ఆలయ పనులపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2024 నవం బర్ మీరే రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సుమారు రూ.700 కోట్లతో అంచనాలు తయారు చేసినా.. మొదటి విడుతలో కేవలం రూ.52కోట్లతో పనులు చేస్తున్నారు. ఫౌండేషన్ వేసి రెండేళ్లు కావొస్తున్నది. ఇంకా మొదటి విడుతలోని మహా మండపం, నాగిరెడ్డి మండపం, అద్దాల మండపం, కోటిలిం గాలు, బ్రాహ్మణ సత్రం, నిత్య కల్యాణ మండపం, ధర్మగుండం, తూర్పు గోపురం, పడమటి దక్షిణ ప్రాకారం పనులే కొనసాగుతు న్నాయి. ఇది ఇలా ఉంటే భారీ ఎత్తుతో సిమెంట్ స్లాబ్ వేయడంతో స్వామివారి గర్భాలయం కనిపించకుండా పోతున్నదని తెలిసి బాధ పడుతున్నాం. తప్పిదాలను కప్పిపుచ్చుకొనేందుకు, దాని ఎత్తు పెంచేందుకు జరుగుతున్న ప్రయత్నాలు చూస్తే రాజన్న ఆలయ విస్తరణ పనుల్లో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. ఫౌండే షన్ వేసి రెండేళ్లు అవుతుండగా.. పూర్తి కావడానికి ఎన్నేళ్లు పడు తుందో తెలియని పరిస్థితి. అందుకే మా రాజన్న దర్శనం మాకు దక్కేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నాం.
ఆనాడు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మీరు ఎన్నికలకు ముందు ముంపు గ్రామాల్లో పర్యటించారు. అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరించి తీరుతామని మీరు చెప్పారు. ఆ మాటలు ఇప్పటికీ మా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. మధ్యమానేరు ప్రాజె క్టులో చీర్లవంచ, చింతలకాణా, అనుపురం, కొడిముంజు, సంకె పల్లి, రుద్రవరం, ఆరపల్లి, శభాష్‌పల్లి, కొదురుపాక, నీలో జిపల్లి, వరవెల్లి, గుర్రంవానిపల్లె, మాన్వాడ గ్రామాల్లోని 10,680 కుటుం బాలు ముంపునకు గురయ్యాయి. నిర్వాసిత కుటుంబాలకు ఇండ్ల నిర్మాణం • కోసం ప్రతి కుటుంబానికి రూ.5.04 లక్షలు ఇస్తామని ప్రకటించారు. ప్రతి గ్రామంలోని యువతీ యువకులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. ముంపు నిర్వాసితులకు ఉపాధి కోసం ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసి, పరిశ్రమలు నెలకొల్పుతామన్నారు. మహిళలకు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. ముంపు గ్రామాల్లో నెలకొన్న ప్రతి సమస్యనూ పరి ష్కరిస్తామని ఆనాడు హామీ ఇచ్చారు. కానీ, మూడేళ్లు అవుతున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మా ముంపు గ్రామాల బిడ్డల పరిస్థితి ఉంది. 2024 నవంబర్ లో మీరు వేములవాడకు వస్తున్నారని ఆగమేఘాల మీద 4,880 మందికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవడానికి జీవో జారీ చేశారు. దీనిని నిర్వాసిత కుటుంబాలు ఆనాడే వ్యతిరేకించాయి. ప్రతి నిర్వాసిత కుటుంబా నికి రూ. 5.04 లక్షలు ఇవ్వాలని నాటి నుంచి నేటి వరకు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. అయినా మీ నుంచి స్పందన లేదు. మా సమ స్యలపై తాజాగా అధికారులకు వినతిపత్రం ఇచ్చాం. మీ వరకు చేరేలా మీ నాయకులకు అందించాం. వీటిపై రేపు మాకు స్పష్ట మైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు ఆనాడు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటారా..? లేక మాట తప్పుతారా..? అన్నది నేడు మీరు మాకు ఇచ్చే హామీలను బట్టి తెలుస్తుం
సిరిసిల్ల జిల్లాలో వైద్యరంగం కుదేలైంది. ఒకప్పుడు నెలకు 150 గైనిక్ ఆపరేషన్లు చేసి రాష్ట్రంలోనే ప్రశంసలు పొందిన వేము లవాడ ఏరియా దవాఖానలో ఇప్పుడు నెలకు కేవలం 30 నుంచి 40 ఆపరేషన్లు కూడా జరగడం లేదు. హైదరాబాద్ లాంటి నగరా లకు మాత్రమే పరిమితమైన మోకాలు శస్త్రచికిత్సలు ఇదే హాస్పిట ల్లో ఉచితంగా అందడంతో వందలాది మంది మా ప్రాంత నిరు పేద బిడ్డలు లబ్ధిపొందారు. ఇప్పుడు ఏడాది కాలంగా మోకాలు ఆపరేషన్లు ఆగిపోయాయి. పరికరాలు చెడిపోయాయంటున్నారు. సిరిసిల్లలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితులు ఉన్నాయి. యువత ఉపాధిపై మీ సర్కారు పూర్తిగా నిర్లక్ష్యం చూపుతున్నది. కొత్త పరిశ్ర మలు లేవు.. మంజూరైన పరిశ్రమలను పట్టించుకోరు అన్నట్టు న్నది మీ మూడేళ్ల పనితీరు. దీనికి నిదర్శనం ఆక్వాహబ్, ఫుడ్ ప్రాసెసింగ్ జోను విస్మరించడం! బీఆర్ఎస్ హయాంలో 366 ఎకరాల్లో రూ.90 కోట్లతో శ్రీకారం చుట్టిన ఆక్వాహబ్, నర్మాల గ్రామంలో 309 ఎకరాల్లో రూ.100 కోట్లతో ఏర్పాటైన వాటిని అమల్లోకి తీసుకొచ్చి మా బిడ్డలకు ఉపాధి చూపాలి. దీనిపై ముఖ్యమంత్రిగా స్పష్టమైన ప్రకటన చేయాలి. సిరిసిల్లను ఎడ్యుకే షన్ హబ్ కేటీఆర్ తీర్చిదిద్దారు. అయితే రూ.400 కోట్లతో మా జిల్లాకు మంజూరైన జేఎన్ టీయూ ఇంజినీరింగ్ క
..ఇట్లు
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు