టీచర్లపై కలెక్టర్ల పెత్తనం
ఇంట్లో బిడ్డ పెండ్లి పెట్టుకున్న తల్లికో, తండ్రికో వారం, పదిరోజుల సెలవును నిరాకరించడానికి మించిన క్రూరత్వం మరొకటి ఉంటుందా? ఇవాళ రాష్ట్రంలోని సర్కార్ స్కూళ్ల టీచర్లు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ‘జ్వరమొచ్చినా, అనారోగ్యంతో మంచానపడ్డా నో లీవ్. సొంత కుటుంబంలో విషాదం జరిగినా, దగ్గరి బంధువు చనిపోయినా సెలవు అడుగొద్దు. చివరికి కన్నబిడ్డల పెండ్లిళ్లు చేయాలన్నా, శుభకార్యాలు పెట్టుకున్నా సెలవు దొరుకదు’ ఇదీ రాష్ట్రంలోని సర్కార్ స్కూల్ టీచర్ల పరిస్థితి.
- సెలవులపై ఆంక్షల కొరడా!
- ఉపాధ్యాయుల హాజరుపై ఐఏఎస్‌లకు పెత్తనం
- సర్కార్ వింత ధోరణి.. 95% హాజరుకు హుకుం
- జ్వరమొచ్చినా సెలవు కష్టమే.. పిల్లల పెండ్లిళ్లకూ నో
- సెంట్రలైజ్ట్ సిస్టమ్‌తో టీచర్లు ఉక్కిరిబిక్కిరి
- సర్కార్ తీరుపై ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఇంట్లో బిడ్డ పెండ్లి పెట్టుకున్న తల్లికో, తండ్రికో వారం, పదిరోజుల సెలవును నిరాకరించడానికి మించిన క్రూరత్వం మరొకటి ఉంటుందా? ఇవాళ రాష్ట్రంలోని సర్కార్ స్కూళ్ల టీచర్లు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ‘జ్వరమొచ్చినా, అనారోగ్యంతో మంచానపడ్డా నో లీవ్. సొంత కుటుంబంలో విషాదం జరిగినా, దగ్గరి బంధువు చనిపోయినా సెలవు అడుగొద్దు. చివరికి కన్నబిడ్డల పెండ్లిళ్లు చేయాలన్నా, శుభకార్యాలు పెట్టుకున్నా సెలవు దొరుకదు’ ఇదీ రాష్ట్రంలోని సర్కార్ స్కూల్ టీచర్ల పరిస్థితి.
ఇటీవల ఉపాధ్యాయులపై జిల్లా కలెక్టర్లు, ఐఏఎస్‌ల పెత్తనం పెరిగిపోయిందని, 95% హాజరు పేరిట ముప్పుతిప్పలు పెడుతున్నారని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నా యి. ప్రత్యేకించి హైదరాబాద్ జిల్లాలో టీచర్ల కు సెలవులు రద్దు చేశారు. సెలవు పెట్టాలంటే అడిషనల్ కలెక్టర్ అనుమతి తప్పనిసరి చేయ డం తీవ్ర దుమారం రేపింది. పలు జిల్లాల్లో నూ షోకాజ్ నోటీసులిచ్చారు. విద్యాశాఖ అధికారుల జోక్యం కూడా మితిమీరుతున్నదని, తీవ్రమైన ఒత్తిడి పెడుతున్నారని ఉపాధ్యాయులు చెప్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతాపం చూపుతామని టీచర్లు, సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.
పిల్లల పెండ్లిళ్లకు నో లీవ్
ప్రస్తుతం కార్తిక మాసం కావడంతో పెండ్లి ళ్లు ఊపందుకున్నాయి. పలువురు టీచర్లు కూడా తమ బిడ్డల పెండ్లిళ్లు పెట్టుకున్నారు. అయితే, వారికి సెలవులు ఇచ్చేందుకు పై అధికారులు ‘నో’ చెప్తున్నారట! దీంతో ఆయా టీచర్లకు ఇంట్లో పెండ్లి కంటే సెలవుల టెన్షనే ఎక్కువయ్యింది. హైదరాబాద్ జిల్లాలోని ఒక టీచర్ ఏకైక కూతురి వివాహం ఈ నెల 26న జరుగా ల్సి ఉన్నది. మొదట పది రోజుల సెలవు అడిగితే ఇవ్వలేమన్నారు. చివరికి వారం రోజులు కావాలన్నా ఇవ్వలేదు. ‘మేమైతే సెలవులు ఇవ్వం. కావాలంటే పైనుంచి పర్మిషన్ తెచ్చుకోండి..’ అని హెడ్మాస్టర్ తన నిస్సహాయతను వ్యక్తంచేయడంతో సదరు టీచర్ పెండ్లి పనులు పక్కనపడేసి సెలవుల కోసం తిరుగాల్సిన చే యాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బూమరాంగ్
నవంబర్ నెలను విద్యాశాఖ హాజరు మా సంగా ప్రకటించింది. ప్రతి పాఠశాలలో 95% హాజరు ఉండాల్సిందేనని ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మరీ ఆదేశాలిచ్చారు. సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం బూ మరాంగ్ అయ్యింది. అసలు 95% హాజరు అసాధ్యమని ఉపాధ్యాయ సంఘాలంటున్నా యి. ‘పది మంది టీచర్లు పనిచేస్తున్న చోట ఒక టీచర్ సెలవు పెడితే హాజరు 90శాతమే అవుతుంది. రాష్ట్రంలో సింగిల్ టీచర్ స్కూళ్లు ఐదువేలు ఉన్నాయి. ఇద్దరు టీచర్లున్న స్కూళ్లు వేలల్లో ఉన్నాయి. ఉన్న ఒక్కరు సెలవు పెడితే హాజరు శాతం 50కి పడిపోతుందని, ఈ తరుణంలో 95% హాజరు శాతాన్ని నిర్దేశించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
అనారోగ్యంలోనూ అవస్థలే
ఇప్పటివరకూ ఉన్న నిబంధనల ప్రకారం టీచర్లు సెలవు పెట్టాలంటే తమ హెడ్మాస్టర్కు దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. ఒక్క హెచ్ఎం మాత్రమే పైస్థాయి అధికారులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. సెలవు కాలం మూడు నెలలు దాటితేనే పైస్థాయి అధికారులకు దరఖాస్తు చేయాలి. సెలవుల మంజూరులో పైస్థాయి అధికారులు జోక్యం ఉండేదే కాదు. దీనిని పక్కనపెట్టి విద్యాశాఖ సెంట్రలైజ్డ్ లీవ్స్ సిస్టమ్ తీసుకొచ్చింది. దీంతో సాధారణ సెలవులకు సైతం పైస్థాయి అధికారుల అనుమతి తప్పనిసరి చేశారు. దీంతో క్యాన్సర్, కిడ్నీ రోగులు అనేక అవస్థలు పడుతున్నారు. ఇదేం పెత్తనమని నిలదీస్తున్నారు.
వెనక్కి తీసుకోవాల్సిందే
టీచర్ల సెలవులపై కలెక్టర్లు, ఐఏఎస్‌ల జోక్యాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రత్యేకించి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులపై సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయ సంఘాలన్నీ జిల్లా కలెక్టర్‌ను కలిసి నిరసన వ్యక్తంచేశాయి. ఓ ఉపాధ్యాయ సంఘం నేత ఇదే విషయంపై మాట్లాడుతూ.. దగ్గరి బంధువు చనిపోతే కూడా వెళ్లకూడదా? సెలవు కోసం కలెక్టరేట్‌కు రావాల్నా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మరో ఉపాధ్యాయ సంఘం నేత మట్లాడుతూ.. ‘డ్యూటీకి రాకపోతే, అనధికారికంగా డుమ్మా కొడితే సస్పెండ్ చేయండి. కానీ, లీవ్‌లను నిరాకరించే హక్కు ఎక్కడిది’ అని ప్రశ్నించారు. ఇంత అప్రజాస్వామిక ప్రభుత్వం, అధికారులను తానెప్పుడూ చూడలేదని మరో ఉపాధ్యాయ సంఘం నేత మండిపడ్డారు. హాజరు పర్యవేక్షణ పేరిట టీచర్లను ఒత్తిడికి గురిచేయడం మానుకోవాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. టీచర్లు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్ఆర్ఎస్ హాజరును అమలు చేస్తున్నారు. అయితే, రిటైర్డ్ ఉద్యోగులు, చనిపోయిన టీచర్ల పేర్లు తొలగించలేదు. దీంతోనే హాజరు శాతం తక్కువగా చూపిస్తున్నదని ఉపాధ్యాయ సంఘాల నేతలంటున్నారు.
సెలవులను నిలువరించడం దారుణం
ఎవరికీ సెలవులు ఇవ్వవద్దని ఆదేశాలివ్వడం అత్యంత దారుణం. విద్యారంగంలో జిల్లా కలెక్టర్ల పెత్తనం అధికమవుతున్నది. బ్రిటిష్ పాలనను తలపిస్తున్నది. సెలవులు 20% మించకుండా చూసుకోవాలి. కానీ, ఏకపక్షంగా సెలవులను నిలువరించే ప్రయత్నం చేయడం హాస్యాస్పదం. ఇలాంటి ఆంక్షలతో ప్రభుత్వంపై టీచర్లల్లో వ్యతిరేక భావం పెరుగుతున్నది.
– రాజ గంగారెడ్డి, హెచ్ఎం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

