CM Vijay | అజిత్ కార్ రేసింగ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా సీఎం విజయ్.. లండన్‌లో పచ్చజెండా ఊపనున్న దళపతి!
ఇంగ్లాండ్‌లోని ప్రఖ్యాత సిల్వర్‌స్టోన్ సర్క్యూట్లో జరగనున్న మిచెలిన్ లీ మాన్స్ కప్ కార్ రేసింగ్ ఈవెంట్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ వెలువడింది.
Silverstone Round | ఇంగ్లాండ్‌లోని ప్రఖ్యాత సిల్వర్‌స్టోన్ సర్క్యూట్లో జరగనున్న మిచెలిన్ లీ మాన్స్ కప్ కార్ రేసింగ్ ఈవెంట్‌కు సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఈ రేసింగ్ పోటీకి ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. యూకేలో పోటీపడుతున్న భారతీయ డ్రైవర్లకు మద్దతుగా నిలవడంతో పాటు, 44 కార్ల గ్రిడ్ ముందు ప్రారంభమయ్యే ఈ రెండు గంటల ఎండ్యూరెన్స్ రేసును సీఎం విజయ్ అధికారికంగా పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని లీ మాన్స్ కప్ నిర్వాహకులు తమ అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 12న సిల్వర్‌స్టోన్ యొక్క 5.891 కిలోమీటర్ల గ్రాండ్ ప్రిక్స్ సర్క్యూట్లో ఈ ప్రతిష్టాత్మక రేసు జరగనుంది. ఈ ఛాంపియన్షిప్ ఐదవ రౌండ్లో ప్రముఖ నటుడు, రేసర్ అజిత్ కుమార్ కూడా బరిలో దిగుతున్నారు. అజిత్ రెడ్‌ఆంట్ బై విరాజ్ (Ajith Red Ant by Virage) తరఫున ఎల్ఎంపీ3 ప్రో/యామ్ (LMP3 Pro/Am) విభాగంలో ఫ్రాన్స్‌కు చెందిన రోమెయిన్ వోస్నియాక్తో కలిసి అజిత్ కుమార్ ఈ రేసులో పాల్గొంటున్నారు. అలాగే మాజీ ఫార్ములా వన్ డ్రైవర్ నారాయణ్ కార్తికేయన్, ఆదిత్య పటేల్ జోడీ సైతం మరో ఎల్ఎంపీ3 విభాగంలో అజిత్ రెడ్ ఆంట్ రేసింగ్ తరఫున ప్రత్యేకంగా బరిలో నిలుస్తున్నారు. అయితే ఈ ఈవెంట్ కోసం లండన్‌తో పాటు తమిళ ప్రేక్షకులు కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
A special guest will be waving the green flag at Silverstone this weekend! 👉 C. Joseph VIJAY
The Indian actor and Chief Minister of Tamil Nadu @actorvijay, will be joining us to support our Indian drivers in the UK and officially start the #SilverstoneRound in front of the… pic.twitter.com/pZiZOKy7yW
— Le Mans Cup (@LeMansCup) September 10, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

