ఢాకా: బంగ్లాదేశ్లో సైనిక విన్యాసాల సందర్భంగా ఆ దేశ ఆర్మీ వినియోగిస్తున్న చైనా తయారీ ట్యాంక్ పేలింది. ఈ సంఘటనలో ఇద్దరు బంగ్లాదేశ్ సైనికులు మరణించారు. మరో సీనియర్ ఆర్మీ అధికారి గాయపడ్డారు. ఆయనను మిలిటరీ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. (China-made tank explodes) బుధవారం చట్టోగ్రామ్లోని హథజారి ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో బంగ్లాదేశ్ ఆర్మీ సైనిక విన్యాసాలు నిర్వహించింది. ఈ సందర్భంగా చైనాకు చెందిన టైప్ 59 ట్యాంక్ నుంచి ఫైరింగ్ చేశారు. అయితే ఈ సంఘటనలో ఆ యుద్ధ ట్యాంక్ పేలిపోయింది. అందులో ఉన్న ఇద్దరు బంగ్లాదేశ్ సైనికులు మరణించారు. మరో ఆర్మీ అధికారి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఆ అధికారిని మెరుగైన చికిత్స కోసం ఢాకాలోని కంబైన్డ్ మిలిటరీ హాస్పిటల్కు హెలికాప్టర్లో తరలించారు.
కాగా, చైనా తయారీ టైప్ 59 (టీ-59) రకానికి చెందిన ట్యాంకర్లను బంగ్లాదేశ్ ఆర్మీ వినియోగిస్తున్నది. అయితే సైనిక విన్యాసాల్లో ఆ ట్యాంక్ ఎందుకు పేలింది అన్న దానికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను గుర్తించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు బంగ్లాదేశ్ ఆర్మీకి చెందిన అంతర సేవల ప్రజా సంబంధాల డైరెక్టరేట్ (ఐఎస్పీఆర్) పేర్కొంది. మిలిటరీ డ్రిల్ సందర్భంగా చైనా తయారీ యుద్ధ ట్యాంక్ పేలుడుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
BANGLADESH ARMY TANK EXPLODED DURING FIRING EXERCISE, 2 SOLDIERS KILLED
Two Bangladesh Army soldiers were killed and an officer seriously injured during a field-firing exercise at the Hathazari Field Firing Range in Chattogram.
The injured officer was airlifted to Dhaka’s… pic.twitter.com/fC88Sb2Qzh
— Subodh Kumar (@kumarsubodh_) September 9, 2026