రాయపోల్ : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రానికి చెందిన రజక సంఘం రాష్ట్ర నాయకులు గౌరి గారి పరశురాములు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ( MLA Prabhakar Reddy ) శుక్రవారం ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి వివరాలను వైద్య సిబ్బందితో మాట్లాడారు.
మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు. పరశురాములు కుటుంబానికి ఎల్లప్పుడు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే వెంట రాయపోల్ మాజీ జడ్పీటీసీ లింగాయపల్లి యాదగిరి, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర శర్మ , బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకులు రాజిరెడ్డి, మండల యువజన అధ్యక్షులు గల్వా దయాకర్ రెడ్డి , మాజీ సర్పంచ్ నర్సింలు పాల్గొన్నారు.