కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ( Journalists ) ఎలాంటి ఆంక్షలు లేకుండా హెల్త్ కార్డులు ( Health Cards ) మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లా కేంద్రంలో టీయూడబ్ల్యూజే ( ఐజేయూ ) ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం నిర్వహించారు. ఉద్యోగులకు సమానంగా అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు హెల్త్ కార్డు మంజూరు చేసి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు కల్లోజు శ్రీనివాస్ కోరారు .
జర్నలిస్టుల సంక్షేమ కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఒకవైపు చెబుతూనే, సమస్యలు తీర్చకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. జర్నలిస్టు సంక్షేమానికి కృషి చేయాలని, ముఖ్యమంత్రి కళ్ళు తెరవాలని డిమాండ్ చేస్తూ గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించి జర్నలిస్టులు పోస్టు కార్డు ఉద్యమం చేపట్టామని వివరించారు .
ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే( టీజేఎఫ్) వర్కింగ్ జర్నలిస్టులు మట్టికొండ రవి, సహాయ కార్యదర్శి కాగితపు వెంకటేశ్వరరావు, కృష్ణ గోవింద్, మోటమర్రి రామకృష్ణ, సీమకుర్తి రామకృష్ణ, ప్రభాకర్ రెడ్డి, కందుకూరి ఈశ్వర్, చావా పాపారావు , కృష్ణారావు రమేష్ ,తారక్ , అశోక్, ప్రవీణ్, అరు ణ్ షబ్బీర్ ,శ్రీనివాస్, రాందాస్, జక్కంపూడి నరేష్ సత్య ,లక్ష్మణ్, రహీం, స్వామి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.