నాగరాజు సేవలు ప్రశంసనీయం
రెండు దశాబ్దాలుగా భారత్యూకే సంబంధాల బలోపేతానికి ఉదయ్ నాగరాజు అందించిన సేవలు ప్రశంసనీయమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు.
- రెండు దశాబ్దాలుగా భారత్ – యూకే సంబంధాల బలోపేతానికి కృషి
- బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు ఎన్నికైన తెలంగాణ బిడ్డను సన్మానించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ) : రెండు దశాబ్దాలుగా భారత్యూకే సంబంధాల బలోపేతానికి ఉదయ్ నాగరాజు అందించిన సేవలు ప్రశంసనీయమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు ఎన్నికైన తొలి తెలుగు వ్యక్తి, తెలంగాణకు చెందిన ప్రవాస భారతీయుడు ఉదయ్ నాగరాజును న్యూఢిల్లీలో మంగళవారం ఘనంగా సన్మానించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి, పలు రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు హాజరైన ఈ అభినందన సభలో కేటీఆర్ స్వయంగా ఉదయ్ నాగరాజును సతరించి, కరీంనగర్ ఫిలిగ్రీ జ్ఞాపికను బహూకరించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ యూకే పౌరుడిగా అకడి స్థానిక రాజకీయాల్లో క్షేత్రస్థాయి నుంచి ఎదిగి హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా ఎన్నిక కావడం ఆయన పట్టుదల, ప్రజాసేవకు నిదర్శనమని పేరొన్నారు. భవిష్యత్తులోనూ భారత్-యూకే ద్వైపాక్షిక సంబంధాలతో పాటు తెలంగాణలో పెట్టుబడులు, వాణిజ్య రంగాల అభివృద్ధిలో ఉదయ్ నాగరాజు కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
అనంతరం యూకే ఎంపీ ఉదయ్ నాగరాజు మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ఉద్యమం, కేటీఆర్ రాజకీయ ప్రస్థానమే తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని తెలిపారు. ఉన్నత చదువులు, మంచి ఉద్యోగాన్ని వదులుకొని స్వదేశానికి వచ్చి యువతకు ఆదర్శంగా నిలిచిన కేటీఆర్ బాటలోనే తాను నడుస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్‌రావు, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, జాన్సన్ నాయక్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

