అహ్మదాబాద్: ఒక వ్యక్తి స్కూల్ బాలికను లైంగికంగా వేధించాడు. స్కూల్ గ్రౌండ్లో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ బాలిక చేతికి ఏదో ఇంజెక్షన్ చేశాడు. బాధిత బాలిక ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (School Girl Raped) గుజరాత్‌లోని మెహాసానా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. విజాపూర్కు చెందిన ఏడేళ్ల బాలిక రెండో తరగతి చదువుతున్నది.
కాగా, నవంబర్ 19న స్కూల్ వెనుక ఉన్న గార్డెన్‌లోకి ఆ బాలికను ఒక వ్యక్తి తీసుకెళ్లాడు. ఆమెను అనుచితంగా తాకాడు. నవంబర్ 20న అదే వ్యక్తి స్కూల్ గ్రౌండ్లో ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమె కుడి చేతికి ఏదో ఇంజెక్షన్ ఇచ్చాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని అతడు బెదిరించాడు.
మరోవైపు బాధిత బాలిక జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. ఆమె కడుపు నొప్పితో బాధపడటంతో ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో గుర్తు తెలియని వ్యక్తిపై పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడ్ని గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. బాలికకు అతడు ఏ ఇంజెక్షన్ ఇచ్చాడు అన్నది వైద్య నివేదిక ద్వారా తెలుస్తుందని చెప్పారు.
Also Read:
Girl Dies By Suicide | పేరెంట్స్ మొబైల్ ఫోన్ కొనివ్వలేదని.. బాలిక ఆత్మహత్య
Girl Jumps Off School Building | స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి.. విద్యార్థిని ఆత్మహత్య
Man Kills Younger Brother | తమ్ముడి నేర ప్రవర్తన సహించలేక.. హత్య చేసిన అన్న
Uranium In Breast milk | తల్లి పాలలో యురేనియం.. ఆందోళన కలిగిస్తున్న అధ్యయనం