ముంబై: తల్లిదండ్రులు మొబైల్ ఫోన్ కొనివ్వలేదని బాలిక మనస్తాపం చెందింది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (Girl Dies By Suicide) మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చంకపూర్లోని మురికివాడ ప్రాంతంలో కుటుంబంతో కలిసి 13 ఏళ్ల బాలిక నివసిస్తున్నది. 8వ తరగతి చదువుతున్న ఆమె మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడటానికి బానిస అయ్యింది.
కాగా, తనకు మొబైల్ ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను ఆ బాలిక అడిగింది. వారు నిరాకరించడంతో మనస్తాపం చెందింది. ఆదివారం ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆ బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె తల్లి, సోదరి ఇంటికి తిరిగివచ్చిన తర్వాత సీలింగ్‌కు వేలాడుతున్న బాలికను చూసి షాక్ అయ్యారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె మరణంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
Girl Jumps Off School Building | స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి.. విద్యార్థిని ఆత్మహత్య
Man Kills Younger Brother | తమ్ముడి నేర ప్రవర్తన సహించలేక.. హత్య చేసిన అన్న
Chandigarh Bill Row | చండీగఢ్ బిల్లుపై వివాదం.. తుది నిర్ణయం తీసుకోలేదన్న కేంద్రం