హైదరాబాద్ : నాగర్కర్నూల్ ఇంటర్ విద్యార్థిని ప్రసవం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. తనతో పాటు చదువుకున్న సహచర బాలుడిని ఇరికించబోయిన సదరు విద్యార్థిని కేసులో ఇరికించబోయి అడ్డంగా దొరికిపోయింది. నిన్న స్కానింగ్ సెంటర్లో ప్రసవించిన కేజీబీవీ విద్యార్థిని(16)ని పోలీసులు గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బైట పడింది. విచారణలో విద్యార్థిని టెన్త్ పరీక్షలు రాసే సమయంలో ఓ బాలుడితో పరిచయం ఏర్పడిందని.. అతని వల్లే గర్భం దాల్చానని తెలిపింది. దీంతో బాలుడిని అదుపులోకి తీసుకొని విచారించారు.
బాలికతో పరిచయం ఉన్న మాట నిజమేనని, కానీ చాటింగ్ తప్ప తానేం చేయలేదని విచారణలో బాలుడు తేల్చి చెప్పాడు. దీంతో డీఎన్ఏ టెస్ట్ చేసి అసలు నిజాలు తెలుస్తామని పోలీసులు గట్టిగా విచారించడంతో బయపడిన బాలిక ఇంటి సమీపంలో ఉన్న వివాహితుడైన బంధువు వల్ల జరిగిందని ఒప్పుకుంది. వివాహితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా నిజం ఒప్పుకోవడంతో, పోక్సో కేసు నమోదు చేశారు.