Helicopter crash | దట్టమైన అడవిలో కుప్పకూలిన హెలికాప్టర్.. నలుగురు దుర్మరణం
Helicopter crash | దట్టమైన అడవిలో హెలికాప్టర్ (Helicopter) కుప్పకూలి నలుగురు దుర్మరణం పాలయ్యారు. బ్రెజిల్ (Brazil) లోని రియో డి జనీరో (Rio de Janeiro) లో ఈ ప్రమాదం జరిగింది. శనివారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11:11 గంటలకు ఆల్టో డా బోవా విస్టాలోని విస్టా చినేసా ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
Helicopter crash : దట్టమైన అడవిలో హెలికాప్టర్ (Helicopter) కుప్పకూలి నలుగురు దుర్మరణం పాలయ్యారు. బ్రెజిల్ (Brazil) లోని రియో డి జనీరో (Rio de Janeiro) లో ఈ ప్రమాదం జరిగింది. శనివారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11:11 గంటలకు ఆల్టో డా బోవా విస్టాలోని విస్టా చినేసా ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో పైలట్ (Pilot) తోపాటు నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారని అగ్నిమాపక సిబ్బంది ధ్రువీకరించారు.
ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయిన హెలికాప్టర్ శిథిలాలను గుర్తించారు. హెలికాప్టర్ కిందపడగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రత్యేక బృందాలు ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. మృతుల్లో పైలట్‌తోపాటు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కొలంబియన్ మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై రియో మేయర్ ఎడ్వర్డో కావలియర్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. నగరంలో హెలికాప్టర్ల రాకపోకలు విపరీతంగా పెరిగాయని, వాటి భద్రతను పర్యవేక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని బ్రెజిల్ నేషనల్ సివిల్ ఏవియేషన్ ఏజెన్సీ (ఏఎన్ఏసీ) ని కోరినట్లు వెల్లడించారు. ఈ విషయంలో ఏఎన్ఏసీకి తమ పూర్తి సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
కాగా రియోలో ఇటీవలి కాలంలో ఇలాంటి ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది జూన్‌లో రెండు హెలికాప్టర్లు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మరణించారు. అలాగే గత ఏడాది సావో పాలో రాష్ట్రంలోని ఉబటుబాలో ఓ చిన్న విమానం కూలి పైలట్ మృతిచెందాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
‘క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే సంపూర్ణ చికిత్స’
Pinarayi Vijayan | కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌కు ఈడీ సమన్లు.. మనీ లాండరింగ్ కేసులో అక్టోబర్ 23న విచారణ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

