Bonalu | కారేపల్లి క్రాస్ రోడ్లో ఘనంగా బోనాల వేడుక
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం విశ్వనాథపల్లి గ్రామపంచాయతీలోని కారేపల్లి క్రాస్ రోడ్(రామలింగాపురం)లో ఆషాఢ మాసం సందర్భంగా ఆదివారం గ్రామస్తులు బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు.
కారేపల్లి,ఆగస్టు 9: ఖమ్మం జిల్లా సింగరేణి మండలం విశ్వనాథపల్లి గ్రామపంచాయతీలోని కారేపల్లి క్రాస్ రోడ్(రామలింగాపురం)లో ఆషాఢ మాసం సందర్భంగా ఆదివారం గ్రామస్తులు బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. మహిళలు కుటుంబ సమేతంగా కొత్త కుండల్లో బోనాలు తయారు చేసి సంప్రదాయ వస్త్రధారణతో అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. అదేవిధంగా మహిళలు ప్రత్యేకంగా అలంకరించిన బోనాల కుండలను ఇంటి వద్ద నుండి తలపై ఎత్తుకుని డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఎర్రమ్మ ఆలయానికు వెళ్లారు.
కారేపల్లి క్రాస్ రోడ్డు ప్రాంతంలోని గ్రామ దేవతలైన ముత్యాలమ్మ,ఎర్రమ్మ తదితర అమ్మవార్ల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.గ్రామ పెద్దలు సూరపరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, కొత్త నాగేశ్వరరావు, పుచ్చకాయల శ్రీనివాసరావు, మొగిలిచర్ల మల్లికార్జున్, పగడాల నాగేశ్వరరావు, రాజేష్, కంసాని నాగరాజు, మల్లెంపాటి శ్రీనివాసరావు,బట్టు మోహన్,బట్టు శ్రీను స్థానిక ప్రజలు,మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
Former MLA Gandra | చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు చేరువైన పాలన : మాజీ ఎమ్మెల్యే గండ్ర
Premada Oorali | రూ.2 కోట్ల బడ్జెట్‌తో సినిమా,బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వసూళ్లు.. ‘ప్రేమద ఊరాలి’ సంచలనం
AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

