Mmbai Conamn | ముంబై మోసగాడి మాయాజాలం.. 30 కోట్ల రూపాయలు కాజేసిన వైనం
Mmbai Conamn | స్టాక్ మార్కెట్లో లాభాల పేరుతో కోట్ల రూపాయలు దండుకున్నాడు. ఎవరికీ దొర్కకుండా విగ్గు పెట్టుకుని, మారుపేర్లతో తప్పించుకు తిరుగుతున్నాడు. ఇదీ ముంబై మోసగాడి మాయాజాలం. పాపం పండింది. గుజరాత్లో పోలీసులకు చిక్కాడు.
Mmbai Conamn | తనను ఎవరూ గుర్తుపట్టకుండా విగ్గు పెట్టుకుని, మారుపేర్లతో తప్పించుకు తిరుగుతున్న 56 ఏండ్ల రోషన్ భూషణ్ షేత్ (Roshan Bhushan Sheth) అనే ముంబై మోసగాడిని గుజరాత్లో అరెస్ట్ చేసినట్లు ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (EOW) అధికారులు సోమవారం వెల్లడించారు. స్టాక్ మార్కెట్ పేరుతో రూ. 30 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులపై 5 శాతం రాబడి ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేశాడు. వారిని నమ్మించేందుకు తప్పుడు లాభాల సర్టిఫికెట్లను సృష్టించి బాధితులకు చూపించేవాడు. దీంతో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో 42 మంది బాధితుల నుంచి రూ. 30.26 కోట్లు వసూలు చేశాడు. ఈ బాధితుల్లో ఒక ఎన్నారై మహిళ కూడా ఉన్నారు.
ఆ డబ్బులతో విలాసవంతమైన విల్లాలు, ఫ్లాట్లు, లగ్జరీ కార్లు, గడియారాలను కొనుగోలు చేశాడు. విలాసవంతంగా జీవించాడు. ఏప్రిల్‌లో కండివాలికి చెందిన 60 ఏండ్ల సంజయ్ హీరాలాల్ షా రోషన్ భూషణ్ తన కుటుంబాన్ని రూ. 10.81 కోట్లకు మోసం చేశాడని ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం బయటపడింది. ‘ఇన్వెస్టాక్ (Investok)’ పేరుతో యాప్‌ను రూపొందిస్తానని చెప్పి 2020లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన హీరాలాల్ షా కుమారుడితో స్నేహం ఏర్పరచుకున్నాడు. తరువాత ఆ కుటుంబాన్ని భారీగా పెట్టుబడి పెట్టేలా ఒప్పించాడు. అలాగే పలు అపార్ట్మెంట్లలో సమావేశాలు నిర్వహించి తప్పుడు పత్రాలతో ఇతరులను ఆకర్షించి డబ్బులు వసూలు చేశాడు. అనుమానం రాకుండా ఉండేందుకు రూ. 3.8 కోట్లు వాయిదాల్లో చెల్లించి 2025, డిసెంబర్ నుంచి చెల్లింపులను నిలిపివేసి ఏప్రిల్ నుంచి కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. సాంకేతికతను వినియోగించి రోషన్ భూషణ్ గుజరాత్‌లోని వల్సాద్‌లో ఉన్న ఓ భవనంలో ఉన్నట్టు గుర్తించారు. జూలైలో పోలీసులు హౌస్‌కీపింగ్ సిబ్బంది వేషంలో అపార్ట్మెంట్లోకి వెళ్లి అరెస్ట్ చేశారు.

Wig, Id Cards, Cash
అప్పటి నుంచి అతడిపై విచారణ జరిపిన పోలీసులు విగ్, మూడు మారుపేర్లతో ఉన్న ఐడెంటిటీలను గుర్తించారు. వయసులో ఉన్నప్పుడు జయేష్ హన్ముఖ్ భాయ్ షా, ఢిల్లీలో రాహుల్ అతుల్ భాయ్ పరేఖ్, ముంబైలో రోషన్ భూషణ్ షేత్ పేర్లతో చెలామణి అయ్యాడు. అతడి నుంచి ఒక బీఎండబ్ల్యూ, ఒక మెర్సిడెస్, ఒక మహీద్ర థార్ కార్లు, 14 లగ్జరీ వాచీలు, రూ. 1.67 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 17 లక్షల నగదు, మూడు నివాస ఆస్తులను జప్తు చేశారు. విగ్‌ను తయారు చేసిన సెలూన్ సిబ్బందితో సహా 37 మంది సాక్షులు అతడిని గుర్తించడంతో సెప్టెంబర్ 1న చార్జిషీట్ దాఖలు చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

