Mollywood Times | అసలు అనుకున్న ముగింపు వేరు.. ‘మాలీవుడ్ టైమ్స్’ క్లైమాక్స్‌పై దర్శకుడు సంచలన వ్యాఖ్యలు!
Abhinav Sunder Nayak | మలయాళ యంగ్ హీరో నస్లెన్ ప్రధాన పాత్రలో, 'ముకుందన్ ఉన్ని అసోసియేట్స్' ఫేమ్ అభినవ్ సుందర్ నాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన డార్క్ కామెడీ చిత్రం 'మాలీవుడ్ టైమ్స్' (Mollywood Times) క్లైమాక్స్ గురించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
Abhinav Sunder Nayak | మలయాళ యంగ్ హీరో నస్లెన్ ప్రధాన పాత్రలో, ‘ముకుందన్ ఉన్ని అసోసియేట్స్’ ఫేమ్ అభినవ్ సుందర్ నాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన డార్క్ కామెడీ చిత్రం ‘మాలీవుడ్ టైమ్స్’ (Mollywood Times) క్లైమాక్స్ గురించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. జూన్‌లో థియేటర్లలో విడుదలై, ప్రస్తుతం జియోహాట్‌స్టార్ (JioHotstar) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు తాము మొదట మరో రకమైన క్లైమాక్స్ అనుకున్నామని, ఆ సన్నివేశాన్ని చిత్రీకరించాము కూడా అని దర్శకుడు అభినవ్ సుందర్ నాయక్ తాజాగా వెల్లడించారు.
ఈ సినిమాలో నస్లెన్ పోషించిన యువ దర్శకుడు వినీత్ మాధవన్ పాత్రకు సంబంధించిన ఒరిజినల్ ముగింపు గురించి అభినవ్ వివరిస్తూ.. “మేము మొదట అనుకున్న క్లైమాక్స్ పూర్తిగా భిన్నమైనది, దాన్ని షూట్ కూడా చేశాము. ఆ వెర్షన్ ప్రకారం.. వినీత్ మాధవన్ (నస్లెన్) స్టేజీపై నిలబడి ఒక అద్భుతమైన, ఎమోషనల్ స్పీచ్ ఇస్తాడు. కానీ చివరకు చూస్తే, అతను స్టేజీపై నిలబడి కేవలం తన మనసులోనే ఆ స్పీచ్ ఇస్తున్నట్లు ఊహించుకుంటాడు. ఆ వెంటనే వాస్తవంలోకి వచ్చిన అతను, యాంకర్ చేతిలో ఉన్న మైక్ తీసుకుని కేవలం ‘థాంక్యూ’ (THANK YOU) అని ఒక్క మాట చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నిజానికి నాకు ఈ వెర్షనే బాగా నచ్చింది. ఆ ముగింపు ఉండి ఉంటే సినిమా మరింత డార్క్‌గా ఉండేది” అని పేర్కొన్నారు.
సినిమా ఇండస్ట్రీలోని చీకటి కోణాలను, ఒక ఔత్సాహిక దర్శకుడి ఆశలు, నిరాశలను వ్యంగ్యంగా చూపించిన ‘మాలీవుడ్ టైమ్స్’ చిత్రం ఓటీటీలో విడుదలైన తర్వాత సినీ ప్రియుల మధ్య పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఇప్పుడు దర్శకుడు స్వయంగా తాము షూట్ చేసిన అసలు క్లైమాక్స్ గురించి బయటపెట్టడంతో, ఆ ఆల్టర్నేట్ ఎండింగ్‌ను కూడా విడుదల చేయాలని నెటిజన్లు కోరుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mollywood Times | అసలు అనుకున్న ముగింపు వేరు.. ‘మాలీవుడ్ టైమ్స్’ క్లైమాక్స్‌పై దర్శకుడు సంచలన వ్యాఖ్యలు!
Harish Rao | దీక్షా దివస్.. అమరవీరుల స్థూపానికి హరీశ్ రావు నివాళులు.. వీడియో
Yadagirigutta | యాదగిరిగుట్టలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Siddharth Galla | కొరియా అమ్మాయిని పెళ్లాడిన మహేశ్ బాబు మేనల్లుడు.. వైరల్ అవుతున్న సిద్ధార్థ్ గల్లా వెడ్డింగ్ ఫొటోలు!
Niharika Konidela | కుందనపు బొమ్మలా మెరిసిన మెగా డాటర్.. నిహారిక ఫొటోలు వైరల్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

