Amitabh Bachchan | జయా బచ్చన్‌కు అమితాబ్ చెప్పే అబద్ధం ఇదే.. ఇంట్లో చివాట్లు తప్పించుకోవడానికి ‘టైమ్ టెక్నిక్’!
Amitabh Bachchan | బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దశాబ్దాలుగా తన నటనతో కోట్లాది మంది అభిమానులను అలరిస్తున్న బిగ్‌బీ.. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా అప్పుడప్పుడు అభిమానులతో పంచుకుంటుంటారు. ముఖ్యంగా తన భార్య జయా బచ్చన్‌తో తన అనుబంధం గురించి ఆయన చెప్పే విషయాలు ఎంతో సరదాగా ఉంటాయి.
Amitabh Bachchan | బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దశాబ్దాలుగా తన నటనతో కోట్లాది మంది అభిమానులను అలరిస్తున్న బిగ్‌బీ.. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా అప్పుడప్పుడు అభిమానులతో పంచుకుంటుంటారు. ముఖ్యంగా తన భార్య జయా బచ్చన్‌తో తన అనుబంధం గురించి ఆయన చెప్పే విషయాలు ఎంతో సరదాగా ఉంటాయి. తాజాగా ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమంలో అమితాబ్ చెప్పిన ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కార్యక్రమంలో ఓ కంటెస్టెంట్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ అమితాబ్ బచ్చన్.. జయా బచ్చన్‌ను సమయానికి సిద్ధం చేయడానికి తాను అనుసరించే ఓ ప్రత్యేకమైన పద్ధతిని వెల్లడించారు.
ఏదైనా కార్యక్రమానికి లేదా ప్రత్యేకమైన ఈవెంట్‌కు వెళ్లాల్సి వచ్చినప్పుడు.. అసలు సమయాన్ని జయకు చెప్పకుండా గంట ముందున్న సమయాన్ని చెబుతానని అమితాబ్ సరదాగా వివరించారు. ఉదాహరణకు సాయంత్రం 6 గంటలకు ఒక కార్యక్రమానికి వెళ్లాల్సి ఉంటే.. జయకు మాత్రం 5 గంటలకే బయలుదేరాల్సి ఉందని చెబుతారట.దీంతో జయా బచ్చన్ కూడా ముందుగానే సిద్ధం కావడం ప్రారంభిస్తారని, చివరకు అసలు కార్యక్రమం ప్రారంభమయ్యే సమయానికి తాము అక్కడికి చేరుకోగలుగుతామని బిగ్‌బీ నవ్వుతూ చెప్పారు. సమయానికి రెడీ కావాలంటే మహిళల విషయంలో ఈ పద్ధతి బాగా పనిచేస్తుందని ఆయన చమత్కరించారు. అమితాబ్ బచ్చన్ తన కుటుంబానికి సంబంధించిన మరో విషయాన్ని కూడా కార్యక్రమంలో పంచుకున్నారు. షూటింగ్ కారణంగా ఇంటికి ఆలస్యంగా వెళ్లాల్సి వస్తుందని ముందే తెలిసినప్పుడు.. ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు ముందుగానే తెలియజేస్తానని చెప్పారు.
ఉదయాన్నే కుటుంబ వాట్సాప్ గ్రూప్‌లో అందరికీ నమస్కారం చెబుతూ.. ఆ రోజు షూటింగ్ ఉండటంతో ఇంటికి ఆలస్యంగా వస్తానని, తన కోసం డిన్నర్ విషయంలో ఎదురుచూడవద్దని ముందుగానే సందేశం పంపుతారట. ఇలా ముందే సమాచారం ఇవ్వడం వల్ల ఇంటికి వెళ్లిన తర్వాత ఎదురయ్యే కోపాన్ని కొంతవరకు తప్పించుకోవచ్చని బిగ్‌బీ సరదాగా పేర్కొన్నారు. అయితే ఎప్పుడైనా ఆ సందేశం పంపడం మర్చిపోతే మాత్రం పరిస్థితి మరోలా ఉంటుందని అమితాబ్ చెప్పారు. షూటింగ్ ఆలస్యం అవుతున్న విషయం ముందుగానే చెప్పకుండా ఇంటికి వెళ్లినప్పుడు జయా బచ్చన్ నుంచి చివాట్లు తప్పవని నవ్వుతూ వెల్లడించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
Anurag Thakur: ఆరోపణలు చేస్తాడు.. కోర్టులో క్షమాపణలు చెప్తాడు.. ఇదీ రాహుల్ గాంధీ ట్రాక్ రికార్డు
Jobs DRDO | హైదరాబాద్ డీఆర్డీవోలో 195 అప్రెంటిస్ ఖాళీలు.. నవంబర్ 1 చివరితేదీ
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

