IND vs SLXI: వామప్ మ్యాచ్‌లో దేవ్‌దత్ పడిక్కల్(142 నాటౌట్) భారీ శతకంతో కోలుకున్న భారత జట్టు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రెండోరోజు ఓవర్ నైట్ స్కోర్ 357/6 వద్దే ఆటను ఆపేసిన టీమిండియా.. శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన లంకను పేసర్లు అకీబ్ నబీ, సిరాజ్‌లు వికెట్ల వేటతో దెబ్బకొడితే మ్యాచ్‌పై భారత్ పట్టు సాధించడం ఖాయం.
శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌కు సన్నాహక మ్యాచ్‌లో భారత జట్టు ఆదిలో తడబడినా చివరకు నిలబడింది. మూడు రోజుల వామప్ మ్యాచ్‌లో ప్రధాన ఆటగాళ్లు విఫలమైనా(142 నాటౌట్) భారీ శతకంతో రెచ్చిపోయాడు. కేఎల్ రాహుల్(41), రవీంద్ర జడేజా(63 రిటైర్డ్ హర్ట్)లతో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన పడిక్కల్.. ఆఖరి ఓవర్ వరకూ క్రీజునంటుకుపోయాడు.
#TeamIndia have declared their first innings on their overnight score of 357/6.
Day 3 of the warm-up match begins soon ⏳
Scorecard ▶️ https://t.co/g7rdlUUjY2 pic.twitter.com/x5pSwfOzAa
— BCCI (@BCCI) August 9, 2026
మానవ్ సుతార్(41) సైతం గొప్పగా ఆడడంతో టీమిండియాను ఆలౌట్ చేయాలనుకున్న లంక బౌలర్ల ఆశలు ఆవిరయ్యాయి. ఓవర్‌నైట్ స్కోర్ 357/6తో రెండో రోజు ఆటను ముగించిన భారత్.. మూడోరోజు తొలి బంతికి ముందే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలెట్టిన లంక 3 ఓవర్లకు ఏడు పరుగులు చేసింది. ప్రస్తుతానికి లంక 13 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఓపెనర్ యశస్వీ జైస్వాల్ డకౌటయ్యాక కేఎల్ రాహుల్(41), పడిక్కల్ దూకుడుగా ఆడారు. అర్ధ శతక భాగస్వామ్యంతో లంక బౌలర్ల సహనాన్ని పరీక్షించిన ఈ ద్వయాన్ని కేశర నువాంత(1-40) విడదీశాడు. ఆ తర్వాత వచ్చిన రిషభ్ పంత్(2), ధ్రువ్ జురెల్(1) లు విఫలమైన చోట క్రీజునంటుకున్న పడిక్కల్ ఒత్తిడికి లోనవ్వకుండా స్కోర్ బోర్డును నడిపించాడు.
దేవ్‌దత్ పడిక్కల్(142 నాటౌట్)

ఆఖర్లో మానవ్ సుతార్(41) సైతం రాణించగా భారత్ స్కోర్ దాటింది. ఆఖర్లో గుర్నూర్ బ్రార్(36 నాటౌట్) జతగా లంక ఎక్స్ఐ బౌలర్లను కాచుకున్న పడిక్కల్ అజేయంగా నిలిచాడు. దాంతో, రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన లంక 363-8 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే.