Smriti Mandhana | టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు.. స్మృతి మందాన సంచలనం..!
Smriti Mandhana | భారత మహిళా క్రికెట్ జట్టు (India's Women Cricket Team) వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandana) టీ20 క్రికెట్ చరిత్రలో సంచలనం సృష్టించింది. తన కెరీర్లో మరో అద్భుతమైన మైలురాయిని అందుకుంది. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో పురుషులు, మహిళల క్రికెట్లో కలిపి అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణిగా ఆమె ప్రపంచ రికార్డు (World Record) నెలకొల్పింది.
Smriti Mandhana : భారత మహిళా క్రికెట్ జట్టు (India’s Women Cricket Team) వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandana) టీ20 క్రికెట్ చరిత్రలో సంచలనం సృష్టించింది. తన కెరీర్లో మరో అద్భుతమైన మైలురాయిని అందుకుంది. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో పురుషులు, మహిళల క్రికెట్లో కలిపి అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణిగా ఆమె ప్రపంచ రికార్డు (World Record) నెలకొల్పింది. ఆసియా క్రీడల (Asian Games) సెమీఫైనల్లో బంగ్లాదేశ్ (Bangladesh) తో జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఘనతను ఆమె సొంతం చేసుకుంది.
కొరోగి స్పోర్ట్స్ పార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మంధాన కేవలం 19 బంతుల్లో 37 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఈ క్రమంలో న్యూజిలాండ్ మాజీ క్రీడాకారిణి సూజీ బేట్స్ పేరిట ఉన్న రికార్డును ఆమె అధిగమించింది. ఈ మ్యాచ్‌కు ముందు మంధాన 170 ఇన్నింగ్స్‌లలో 4,751 పరుగులతో రెండో స్థానంలో ఉండగా రికార్డు బ్రేక్ చేయడానికి కేవలం 8 పరుగులు అవసరమయ్యాయి. తన ఇన్నింగ్స్ ఆరంభంలోనే రెండు ఫోర్లు, రెండు సింగిల్స్‌తో ఈ మార్కును సులభంగా దాటేసింది.
తాజా రికార్డుతో మంధాన 171 ఇన్నింగ్స్‌లలో 4,788 పరుగులతో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ జాబితాలో మంధాన, సూజీ బేట్స్ (4,758) తర్వాత పురుషుల టీ20ల్లో అగ్రగామిగా ఉన్న పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం (4,596) మూడో స్థానంలో ఉన్నాడు. వీరి తర్వాత జోస్ బట్లర్ (4,292), భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (4,287) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఈ రికార్డుతో మంధాన పురుషుల క్రికెట్లోని అగ్రశ్రేణి ఆటగాళ్లను కూడా వెనక్కి నెట్టింది.
ఇక ఆసియా క్రీడల సెమీఫైనల్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 2023లో జరిగిన హాంగ్జౌ గేమ్స్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్న భారత జట్టు, ఈసారి కూడా టైటిల్‌ను నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉంది. అంతకుముందు క్వార్టర్ఫైనల్లో భారత్ ఆతిథ్య జపాన్ను ఓడించి సెమీస్‌కు చేరుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

