Harish Rao | సన్నవడ్లకు బోనస్ ఇవ్వకుండా రైతులకు ఎగనామం.. మీ బోనస్ అంతా బోగస్ : హరీశ్ రావు
harish rao | రేవంత్ రెడ్డిని అడుగుతున్నా.. ఈ వానాకాలం సన్నవడ్లకు బోనస్ ఇస్తామని మీరు ఇంతవరకు బోనస్ ఇచ్చారా..? ఉత్తర్వులు జారీ చేశారా..? మీ బోనస్ అంతా బోగస్ అయిపోయిందన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు.
Harish Rao | సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నిజంపేటలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సందర్శించారు. అక్కడి రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు తీవ్ర నష్టపోతున్నారు. నిజాంపేట్ మండల కేంద్రంలో రైతులను కలిసినప్పుడు ఇంతవరకు ఇక్కడ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయలేదన్నారు. కొబ్బరి కాయలు కొట్టారు కానీ గింజ కూడా కొనుగోలు చేయలేదు .. ప్రభుత్వం కొనకపోవడంతో ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకున్నారని తెలిపారు.. రేవంత్ రెడ్డిని అడుగుతున్నా.. ఈ వానాకాలం సన్నవడ్లకు బోనస్ ఇస్తామని మీరు ఇంతవరకు బోనస్ ఇచ్చారా..? ఉత్తర్వులు జారీ చేశారా..? మీ బోనస్ అంతా బోగస్ అయిపోయిందన్నారు.
ఇప్పటివరకు రెండు యాసింగిల్లో సన్నవడ్లు పండించిన రైతులకు బోనస్ ఇవ్వకుండా ఎగబెట్టారు.. పోనీ ఈ వానాకాలమన్నా బోనస్ ఇస్తావా..? అని హరీశ్ రావు ప్రశ్నించారు. సన్న వడ్లకు బోనస్ ఇచ్చేందుకు ఇప్పటివరకు విధి విధానాలు పూర్తి కాలేదు.. నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల నుంచి ఫోన్లు వస్తున్నాయి.. అక్కడ కూడా రూ.2600, రూ.2700 సన్నవడ్లకు ఇస్తాఉన్నరట.. అది కూడా ఒక క్వింటాల్‌కు 5 నుంచి 10 కిలోల తరుగు పెడుతున్నారు.. రూ.2500, రూ.2600 కే సన్నవడ్లు కొంటున్నారన్నారు.
జీవో ఇవ్వాలని డిమాండ్..
దొడ్డు వడ్లు కొనే దిక్కు లేదు.. క్వింటాల్‌కు 10 కిలోలు తరుగు పెడుతుండటంతో రైతులు తీవ్ర నష్టపోతున్నారు . 20 రోజుల నుండి అక్కడే వడ్లు పోసుకొని ఉంటున్నారు. మూడు సార్లు రైతు భరోసా ఎగ్గొడుతివి , రుణమాఫీ చేయకపోతివి. ప్రభుత్వం కొనపోవడంతో దళారులు ఇష్టం ఉన్నట్లు కొంటున్నారు. దొడ్డు రకం వడ్లు 2200 క్వింటాల్ కొంటున్నారు దీనితో రైతు చాలా నష్టపోతున్నారన్నారు. రైతుకు బోనస్ విషయంలో జీవో ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు హరీశ్ రావు.
లక్షల ఎకరాలు పంట ఎండింది …ఇప్పటివరకు లెక్కలు తీయలేదన్నారు హరీశ్ రావు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో లో ప్రతి రైతుకు ఎకరాకు 5000లు సహాయం చేశారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. నాడు కేసీఆర్ పంటలు నష్టపోతే ఎకరాకు 10వేలు ఇచ్చారు నివు కూడా ఇవ్వాలి. యాసంగి రైతు బంధు డబ్బులు కూడా విడుదల చేయాలి. నిన్న మొన్న రైతు భరోసా మెసేజ్ వచ్చాయి …బ్యాంక్ కు పోతే అవి ఫేక్ మెసేజ్ లు అన్నారు. దొడ్డు వడ్లు కోతలు లేకుండా ,తరుగు లేకుండా కొనుగోలు చేయాలి.
ఇప్పటివరకు రెండు యాసంగిల్లో సన్న వడ్లకు బోనస్ ఇవ్వకుండా ఎగవేశావు
కనీసం వానాకాలం అన్నా సన్న వడ్లకు బోనస్ ఇస్తావా, లేదా?
నిన్ను నమ్మి సన్న వడ్లను రైతులు సాగు చేస్తే వాళ్ళు నష్టపోతున్నారు
బోనస్ ఇవ్వకుండా, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా రైతులను రేవంత్ రెడ్డి ఇబ్బందికి గురిచేస్తున్నాడు
ప్రభుత్వం కొనకపోవడంతో ప్రైవేట్ వ్యక్తులకు క్వింటాల్‌కు రూ.2600 చొప్పున అమ్మి రైతులు నష్టపోతున్నారు
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు
— Telugu Scribe (@TeluguScribe) November 17, 2026
Read Also :
విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న వంటమనిషి..? బాలికల గురుకుల స్కూల్లో కలకలం
Jupally Krishna Rao | కాలువల నుండి ఒక్క చుక్క నీరు ఇవ్వం.. మంత్రి జూపల్లి కృష్ణారావు
Free bus | ఫ్రీ బస్సులో సీటు కోసం జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు : వీడియో
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | సన్నవడ్లకు బోనస్ ఇవ్వకుండా రైతులకు ఎగనామం.. మీ బోనస్ అంతా బోగస్ : హరీశ్ రావు
KTR | సోనియా గాంధీ గుండెల్లో తెలంగాణ ఉంటే.. ఆమె ఆత్మకథలో ఎందుకు లేదు? : కేటీఆర్
Bilkis Bano: మళ్లీ భయమేస్తోంది: బిల్కిస్ బానో
Tiger Shroff | వన్ మోర్ ఛాన్స్.. కాల్పుల ఘటన తర్వాత రీఎంట్రీ ఇచ్చిన టైగర్ ష్రాఫ్!
Bellampally Police | రికార్డుల్లోనేమో ఆన్‌డ్యూటీ.. కానీ ఫాంహౌస్‌లో పోలీసుల చిందులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

