Bilkis Bano: మళ్లీ భయమేస్తోంది: బిల్కిస్ బానో
Bilkis Bano: తన కోసం, తన కుటుంబం కోసం, తన పిల్లల కోసం భయం వేస్తోందని బిల్కిస్ బానో అన్నారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుందన్న భయం కలుగుతుందని బిల్కిస్ తెలిపారు. అత్యాచారం, హత్య కేసులో ఇద్దరు నిందితులకు సుప్రీం బెయిల్ ఇవ్వడాన్ని ఆమె సవాల్ చేశారు.
న్యూఢిల్లీ: 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేసి, ఆమె కుటుంబంలోని 14 మందిని హత్య చేసిన కేసులో ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బిపిన్ చంద్ర జోషి, ప్రదీప్ మోర్ధియాల జీవిత ఖైదు శిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తూ జస్టిస్ సుంద్రేశ్, జస్టిస్ వరాలే ధర్మాసనం అక్టోబర్ 28న ఉత్తర్వులిచ్చింది. సోమవారం ఆ ఇద్దరికీ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరీ చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ బిల్కిస్ బానో ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ఇద్దరు నిందితులపై కేసు కొట్టివేసి, బెయిల్ ఇచ్చిన అంశాన్ని కోర్టు తనకు చెప్పలేదని బిల్కిస్ తన ప్రకటనలో వెల్లడించింది.
STORY | Bilkis Bano expresses shock, disbelief at SC order suspending sentences of 2 convicts
Bilkis Bano has expressed shock and disbelief at the Supreme Court order suspending the life sentences and granting bail to two men convicted for gang raping her and murdering seven of her family members during the 2002 riots in Gujarat and granted them bail.
READ: https://t.co/4VvE90bNeq
— Press Trust of India (@PTI_News) November 17, 2026
ఆ నాటి భయాలు మళ్లీ తనకు కలుగుతున్నట్లు ఆమె చెప్పింది. ఇది నమ్మకలేకపోతున్నానని, రెండోసారి కోర్టు ఆదేశాలు ఇచ్చిందని, తనకు చెప్పకుండా కోర్టు ఈ పనిచేసిందని ఆమె అన్నారు. ఇన్నాళ్లు పోరాడిన న్యాయం ఇప్పుడు మళ్లీ సడలిపోతున్నట్లు అనిపిస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తన కోసం, తన కుటుంబం కోసం, తన పిల్లల కోసం భయం వేస్తోందన్నారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుందన్న భయం కలుగుతుందని బిల్కిస్ అన్నారు. ఆదేశాలు ఇవ్వడానికి ముందు ఎందుకు కోర్టు తన అభిప్రాయాన్ని తెలుసుకోలేదని ఆమె ప్రశ్నించారు. బెయిల్ మంజూరీని కోర్టులోనే సవాల్ చేయనున్నట్లు బిల్కిస్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bilkis Bano: మళ్లీ భయమేస్తోంది: బిల్కిస్ బానో
Tiger Shroff | వన్ మోర్ ఛాన్స్.. కాల్పుల ఘటన తర్వాత రీఎంట్రీ ఇచ్చిన టైగర్ ష్రాఫ్!
Bellampally Police | రికార్డుల్లోనేమో ఆన్‌డ్యూటీ.. కానీ ఫాంహౌస్‌లో పోలీసుల చిందులు.. వీడియో
కోడి దొంగతనం కేసు.. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
AP News | ఏపీలో లోకల్‌బాడీ ఎన్నికలు.. ఈ నెల 26న 23 మున్సిపాలిటీల్లో సెలవు..!
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

