విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న వంటమనిషి..? బాలికల గురుకుల స్కూల్లో కలకలం
అడ్డగూడూర్ బాలికల గురుకుల స్కూల్ లో వంటమనిషి విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న ఘటన కలకలం రేపింది.
యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ బాలికల గురుకుల స్కూల్ లో వంటమనిషి విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న ఘటన కలకలం రేపింది. రూ.500, 1000 ఇస్తా వస్తారా అని విద్యార్థినులను గత కొంత కాలంగా వంట మనిషి వేధిస్తున్నట్లు తెలిసింది. సుమారు 20 మంది విద్యార్థి నులను వేధించినట్టు సమాచారం. కాగా, ఈ విషయం బయటకు పొక్కకుండా విద్యార్థినులను ప్రిన్సిపాల్ బెదిరించినట్లు తెలిసింది.
విషయం తల్లిదండ్రులకు తెలియడంతో గుట్టు చప్పుడు కాకుండా వంట మనిషిని ప్రిన్సిపాల్ ఝాన్సీరాణి అక్కడ నుంచి పంపించివేశారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపల్ మీడియాను లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల స్కూల్లో విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న వంటమనిషి
రూ.500, 1000 ఇస్తా.. వస్తారా అని విద్యార్థినులను గత కొంతకాలంగా వేధిస్తున్న వంటమనిషి
యాదాద్రి జిల్లా అడ్డగూడూరు సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల స్కూల్లో కీచక వంటమనిషి
సుమారు 20 మంది విద్యార్థినులను వేధించినట్టు ఆరోపణలు
బయటకు పొక్కకుండా విద్యార్థినులను బెదిరించిన ప్రిన్సిపాల్
విషయం తల్లిదండ్రులకు తెలియడంతో గుట్టుచప్పుడు కాకుండా వంటమనిషిని పంపిన ప్రిన్సిపాల్
స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
మీడియాను లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్న ప్రిన్సిపాల్ ఝాన్సీరాణీ
— Telugu Scribe (@TeluguScribe) November 17, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | అమ్మ భయపడటం నా జీవితంలో ఒక్కసారి కూడా చూడలేదు : రాహుల్‌గాంధీ
విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న వంటమనిషి..? బాలికల గురుకుల స్కూల్లో కలకలం
KTR | తెలంగాణ ఉద్యమ పాదయాత్రకు 15 ఏళ్లు.. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న కేటీఆర్
Rahul Gandhi | నేను నా గర్ల్‌ఫ్రెండ్‌తో రెస్టారెంట్‌కు వెళ్లా.. ఆసక్తికర విషయాన్ని పంచుకున్న రాహుల్‌గాంధీ..!
Jupally Krishna Rao | కాలువల నుండి ఒక్క చుక్క నీరు ఇవ్వం.. మంత్రి జూపల్లి కృష్ణారావు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

