Salman Khan | 60 ఏళ్ల వయసులో సల్మాన్ ఖాన్ ఊరమాస్ లుక్.. ట్రోలర్లకు టీ-షర్ట్ తీసి మైండ్ బ్లోయింగ్ ఆన్సర్!
Salman Khan | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ మరియు 'బిగ్‌బాస్' లైవ్ షోలో ఆయన చేసిన రచ్చ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Salman Khan | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ మరియు ‘బిగ్‌బాస్’ లైవ్ షోలో ఆయన చేసిన రచ్చ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తన ఆరోగ్యం, ట్రోలింగ్ మరియు బిగ్‌బాస్ ప్రోమోపై వస్తున్న విమర్శలపై ఆయన స్పందిస్తూ పూర్తి క్లారిటీ ఇచ్చారు. దేవుడి దయ వల్ల తన ఆరోగ్యం బాగుందని, ఎలాంటి అనారోగ్య సమస్యలూ లేవని సల్మాన్ తెలిపారు. హౌస్‌లో కంటెస్టెంట్ ఖాజీ తన ఆరోగ్యాన్ని వినోదం కోసం ఉపయోగించుకోవడాన్ని తప్పుబట్టే క్రమంలో తాము స్పందించామని, అయితే బిగ్ బాస్ ప్రోమోను అలా కట్ చేసి ఉండాల్సింది కాదని ఆయన పేర్కొన్నారు. అలా చేయడం వల్ల అసలు ఉద్దేశమే దెబ్బతిన్నదని చెబుతూ, నిర్వాహకుల తరఫున ఆయన క్షమాపణలు కోరారు.
తన వయసుపై వస్తున్న విమర్శలకు సల్మాన్ తనదైన శైలిలో గట్టి బదులిచ్చారు. కొంతమంది తన వయసైపోయిందని ట్రోల్ చేస్తున్నారని, కచ్చితంగా తనకు ఇప్పుడు 60 ఏళ్లు అని, అందరూ ఎప్పుడూ ‘మైనే ప్యార్ కియా’ సినిమా నాటిలాగే ఉండలేరంటూ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. అలాగే కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ తర్వాత బరువు పెరిగారంటూ వస్తున్న ట్రోలింగ్‌పై మండిపడ్డారు. ప్రెగ్నెన్సీ తర్వాత ప్రతి ఒక్కరూ బరువు పెరుగుతారని, రీఎంట్రీ ఇచ్చేటప్పుడు ఆమె పర్ఫెక్ట్ ఫిట్‌నెస్‌లోకి వస్తారని ఆమెను సమర్థించారు.
మరోవైపు ఈ వివాదాలన్నింటికీ పుల్ స్టాప్ పెడుతూ ‘బిగ్‌బాస్’ లైవ్ టెలికాస్ట్‌లో సల్మాన్ ఖాన్ తన టీ-షర్ట్ తీసి అందరినీ ఆశ్చర్యపరిచారు. 60 ఏళ్ల వయసులోనూ ఎవరైనా అసూయపడేలాంటి అద్భుతమైన ఫిజిక్‌ను ప్రదర్శించి ట్రోలర్ల నోళ్ళు మూయించారు. తాను ఎందుకు ‘ఓజీ ఫిట్నెస్ ఐకాన్’ అనే విషయాన్ని మరోసారి నిరూపించి అభిమానులను ఉర్రూతలూగించారు.
SALMAN KHAN took his T-shirt off on live telecast of #BiggBoss20 and silenced the so called trollers in his own style.
60 yrs old and still carrying a physique most can only dream of.The OG Fitness Icon for a reason.#SalmanKhan 🔥 pic.twitter.com/E84uGCJrdR
— Pαѕнα (@ibeingxpasha_) September 19, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
‘క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే సంపూర్ణ చికిత్స’
Pinarayi Vijayan | కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌కు ఈడీ సమన్లు.. మనీ లాండరింగ్ కేసులో అక్టోబర్ 23న విచారణ
విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

