నీళ్లను తరలిస్తే సహించం
సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ కుడి కాలువ నుంచి చుక్క నీటి బొట్టును ఇతర ప్రాంతాలకు తరలించినా సహించేది లేదని నంగునూరు మండల రైతులు, బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు.
- ఇరిగేషన్ ఎస్ఈకి రైతులు, నాయకుల వినతి
నంగునూరు, మార్చి 6: సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ కుడి కాలువ నుంచి చుక్క నీటి బొట్టును ఇతర ప్రాంతాలకు తరలించినా సహించేది లేదని నంగునూరు మండల రైతులు, బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. రంగనాయక సాగర్ కుడి కాలువ ఎల్డీ-10 నుంచి కమలాయిపల్లి శివా రు వద్ద డీ3 కెనాల్‌కు నీటిని అనుసంధానం చేసే అక్రమ అదనపు ఓటీ నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిద్దిపేట ఇరిగేషన్ ఎస్ఈ సుధాకిరణ్కు వారు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నంగూనూరు మండల అధ్యక్షుడు లింగం గౌడ్ మాట్లాడుతూ.. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సిద్దిపేట ప్రాంత రైతులకు అన్యాయం చేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా నీటి మళ్లింపునకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఎల్డీ10 కాలువ కింద ఉన్న 11,550 ఎకరాలకు సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారని, ఇలాంటి తరుణంలో కొత్తగా ఆయకట్టు అనుసంధానం చేయడంతో తమ ఆయకట్టు ఎండిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
గతంలోనే భూములు కో ల్పోయిన రైతులను మళ్లీ ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఎంపీ తన పద్ధతి మార్చుకోకపోతే పెద్దఎత్తున ఆం దోళన చేపడుతామని ఆయన హె చ్చరించారు. మైసంపల్లి, ఖానాపూర్, అంక్సాపూర్, నాగరాజుపల్లి, నంగునూ రు, ఘనపూర్, అకెనపల్లి, గట్లమల్యాల, కొండంరాజుపల్లి రైతులు తరలివచ్చి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్ రెడ్డి, సోమిరెడ్డి, రమేశ్‌గౌడ్, లక్ష్మిరెడ్డి, కిష్టారెడ్డి, విజేందర్‌రెడ్డి, సర్పంచ్‌లు సాయిలు, బాలపోచయ్య, నరేశ్‌రెడ్డి, మల్లేశం, మల్లయ్య, రమేశ్, శ్రీధర్‌గౌడ్, తిరుపతి, వేణు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

