AP | గోదావరి పుష్కరాలకు 210 కోట్ల నిధులు
AP | గోదావరి పుష్కరాలకు ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది. పన్నెండేండ్లకు ఒకసారి జరిగే ఈ పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనునులు చేపడుతుంది. ఇందుకు మంజూరైన నిధులతో పనులు చేపడుతున్నారు.
AP | మహా కుంభమేళా మాదిరిగానే అఖండ గోదావరి (Godavari) మహా పుష్కరాలను నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. పుష్కరాల ఏర్పాట్ల కోసం రూ. 210 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసినట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2027లో నిర్వహించే గోదావరి మహా పుష్కరాల కోసం ‘అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్’ను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఈ నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో 238 పాత, కొత్త పుష్కరఘాట్ల అభివృద్ధి పనులు చేపడుతన్నారు.
ఈ ఏడాది ఆరంభం జనవరి 3 నుంచి ఫిబ్రవరి 15 వరకు ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో మహాకుంభమేళా జరిగింది. దీని మాదిరిగానే మహా గోదావరి పుష్కరాలను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ‘అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్’లో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని పుష్కరఘాట్లను ఆధునీకరిస్తున్నారు. నదీ తీరాలను సుందరంగా తీర్చిదిద్దుతునున్నారు. ఈ పుష్కరాలకు ప్రధాన వేదిక అయిన రాజమండ్రి గోదావరి తీరాలను భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ గోదావరి పుష్కరాలు వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు నిర్వహించనున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

