Varun Chakravarthy | మిస్టరీ స్పిన్నర్‌కు గాయం.. ఆసియాడ్కూ అనుమానమే..!
Varun Chakravarthy : స్వదేశంలో అఫ్గనిస్థాన్‌తో టీ20 సిరీస్‌లో బోణీ కొట్టిన టీమిండియా కీలక స్పిన్నర్ సేవల్ని కోల్పోనుంది. రెండో మ్యాచ్ సన్నాహకాల్లో వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) అనుకోకుండా గాయపడ్డాడు.
Varun Chakravarthy : స్వదేశంలో అఫ్గనిస్థాన్‌తో టీ20 సిరీస్‌లో బోణీ కొట్టిన టీమిండియా కీలక స్పిన్నర్ సేవల్ని కోల్పోనుంది. రెండో మ్యాచ్ సన్నాహకాల్లో వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) అనుకోకుండా గాయపడ్డాడు. దాంతో, అతడు తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు. గాయంతో వరుణ్ అఫ్గనిస్థాన్ సిరీస్ నుంచి వైదొలిగాడని సోమవారం బీసీసీఐ వెల్లడించింది. త్వరలో జరుగనున్న ఆసియా క్రీడల్లోపు వరుణ్ కోలుకొని, ఫిట్నెస్ సాధిస్తాడా? లేదా? అనేది భారత జట్టును కలవరపరుస్తోంది.
ఇటీవల భారత ఆటగాళ్లు తరచూ గాయపడుతున్నారు. అఫ్గనిస్థాన్‌తో సిరీస్‌కు ఎంపికైన వారిలో ఇప్పుడు వరుణ్ చక్రవర్తి గాయంతో మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇంగ్లండ్ పర్యటనలో తొడ కండరాల గాయంతో జట్టుకు దూరమైన అతడికి కొత్త గాయమైంది. వరుణ్‌ను పరీక్షించిన బీసీసీఐ వైద్య బృందం విశ్రాంతి సూచించింది.
According to reports, Varun Chakravarthy has suffered a side strain during the first T20I against Afghanistan in Delhi. pic.twitter.com/AD5QN4AMoN
— CricTracker (@Cricketracker) September 14, 2026
‘వరుణ్‌కు ఇప్పుడు కొత్త గాయం అయింది. ఎంఆర్ఐ స్కాన్‌లో పక్కటెముకల్లో సమస్య ఉంది. దాంతో, అతడు అఫ్గనిస్థాన్ సిరీస్ నుంచి వైదొలిగాడు. జపాన్ ఆతిథ్యమిస్తున్న ఆసియా క్రీడల్లో వరుణ్ ఆడడం అనుమానమే’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇప్పటికైతే వరుణ్ స్థానంలో ఇంకెవరిని స్క్వాడ్‌లోకి తీసుకోలేదు. జపాన్ వేదికగా సెప్టెంబర్ 19నుంచి ఆసియాడ్ మొదలవ్వనుంది. అక్కడే ఆతిథ్య జట్టుతో దౌత్య సంబంధాల 75 ఏళ్లకు గుర్తుగా ఏకైక టీ20 ఆడనుంది టీమిండియా. సెప్టెంబర్ 24న జరుగనున్న ఈ మ్యాచ్‌కు కూడా వరుణ్ డౌటే అనిపిస్తోంది. ఇక.. అఫ్గనిస్థాన్‌తో రెండో టీ20 మంగళవారం జరుగనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | ఊబకాయం బాగా ఇబ్బంది పెడుతోందా.. అయితే ఈ టిప్స్ మీ కోసమే..!
Crime News | తల్లిని కత్తితో పొడిచి, భవనంపై నుంచి దూకి.. తొమ్మిదో తరగతి బాలుడి ఆత్మహత్య..!
Tirumala News | శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఫిబ్రవరి నెల కోటా విడుదల
Bodies of SPOs | దారుణం.. శవపేటికలు లేకుండా డంపర్‌లో పోలీసుల మృతదేహాలు తరలింపు..!
buses carrying pilgrims collide | యాత్రికులతో వెళ్తున్న రెండు బస్సులు ఢీ.. నలుగురు మృతి, 30 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

