Saudi Arabia | సౌదీ అరేబియాలో 110 మిలియన్ టన్నుల యురేనియం నిల్వలు.. యుద్ధం వేళ సౌదీ జాక్‌పాట్
Saudi Arabia : ఇరాన్ యుధ్దం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న సౌదీ అరేబియాకు భారీ జాక్‌పాట్ తగిలింది. సౌదీ అరేబియాలో 110 టన్నుల ముడి యురేనియం నిల్వలు ఉన్నట్లు వెల్లడైంది.
Saudi Arabia : ఇరాన్ యుధ్దం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న సౌదీ అరేబియాకు భారీ జాక్‌పాట్ తగిలింది. సౌదీ అరేబియాలో 110 టన్నుల ముడి యురేనియం నిల్వలు ఉన్నట్లు వెల్లడైంది. మెదీనా ప్రాంతంలో యురేనియం సహా పలు అరుదైన ఖనిజాలు బయటపడ్డట్లు సౌదీ అరేబియాకు చెందిన ఎనర్జీ మినిస్టర్ ప్రిన్స్ అబ్దులాజిజ్ బిన్ సల్మాన్ అన్నారు.
మెదీనా ప్రాంతంలోని జబల్ సయిద్ ప్రాజెక్టు వద్ద అధ్యయనం చేస్తుండగా 110 టన్నుల అరుదైన ఖనిజాలు, యురేనియం నిల్వలు లభ్యమైనట్లు ఆయన వెల్లడించారు. ఇరాన్ యుద్ధం కారణంగా ప్రస్తుతం సౌదీ చాలా ఇబ్బందులు పడుతోంది. ముఖ్యంగా ఇరాన్ మద్దతుదారులైన హౌతీ ఉగ్రవాదులు సౌదీ అరేబియాపై దాడులకు దిగుతోంది. దీనివల్ల అక్కడి చమురు క్షేత్రాలు దెబ్బతింటున్నాయి. పోర్టులపై, చమురు నౌకలపై దాడి జరుగుతోంది. దీనివల్ల సౌదీ తీవ్రంగా నష్టపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో యురేనియం నిల్వలు బయటపడటం ఆ దేశానికి భారీ ఊరటనిచ్చేదే.
సున్నీలకు చెందిన సౌదీ అరేబియాకు.. షియాలకు చెందిన ఇరాన్‌కు మధ్య ఘర్షణ నెలకొంది. అయితే, ఇప్పుడు పరిస్తితుల్ని చక్కదిద్దుకునేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు సౌదీ అరేబియా కూడా 2030లోపు అణ్వాయుధ శక్తిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. అమెరికాతో కలిసి సౌదీ అణు కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇలాంటి తరుణంలో యురేనియం బయటపడటం కలిసొచ్చే అంశమే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

