Jabardasth Babu | జబర్దస్త్ బాబు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా… ఏడేళ్ల ప్రేమకు పెద్దల అంగీకారంతో శుభం కార్డు!
Jabardasth Babu | బుల్లితెర ప్రేక్షకులను తనదైన కామెడీతో కడుపుబ్బా నవ్వించే జబర్దస్త్ కమెడియన్ డేగల బాబు ఓ ఇంటివాడయ్యాడు. గత ఏడేళ్లుగా ప్రేమిస్తున్న అమ్మాయి అమూల్యను శుక్రవారం (నవంబర్ 20) వివాహం చేసుకున్నాడు. ఇరు కుటుంబాల పెద్దల ఆశీర్వాదంతో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. తన పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను బాబు సోషల్ మీడియాలో పంచుకోవడంతో అభిమానులు, నెటిజన్లు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Jabardasth Babu | బుల్లితెర ప్రేక్షకులను తనదైన కామెడీతో కడుపుబ్బా నవ్వించే జబర్దస్త్ కమెడియన్ డేగల బాబు ఓ ఇంటివాడయ్యాడు. గత ఏడేళ్లుగా ప్రేమిస్తున్న అమ్మాయి అమూల్యను శుక్రవారం (నవంబర్ 20) వివాహం చేసుకున్నాడు. ఇరు కుటుంబాల పెద్దల ఆశీర్వాదంతో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. తన పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను బాబు సోషల్ మీడియాలో పంచుకోవడంతో అభిమానులు, నెటిజన్లు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బాబు వివాహ వేడుకకు జబర్దస్త్ కమెడియన్లు, బుల్లితెర ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సునీత, టేస్టీ తేజ, జిత్తు, సందీప్, పంచ్ ప్రసాద్, నూకరాజు తదితరులు పెళ్లికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం బాబు పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
డేగల బాబు భార్య పేరు అమూల్య. వీరిది ప్రేమ వివాహం. గత ఏడేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని బాబు గతంలో పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించాడు. అమూల్య బీ ఫార్మసీ పూర్తి చేసింది. అంతేకాకుండా కొన్ని తెలుగు న్యూస్ ఛానళ్లలో యాంకర్‌గా కూడా పనిచేసింది. ఆమె యాంకర్‌గా ఉన్న సమయంలోనే బాబుతో పరిచయం ఏర్పడింది. మొదట స్నేహితులుగా మారిన వీరిద్దరూ ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. బాబు కెరీర్లో ఎదగడానికి అమూల్య ఎంతో ప్రోత్సాహం అందించిందట. కనీసం ఒక్క సినిమా అయినా చేసి, కెరీర్లో స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని బాబు నిర్ణయించుకున్నాడట. అందుకే ఏడేళ్ల పాటు తమ ప్రేమ ప్రయాణాన్ని కొనసాగించిన ఈ జంట ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
డేగల బాబు జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. సాధారణ కంటెస్టెంట్‌గా షోలోకి అడుగుపెట్టి తన కామెడీ పంచులు, ప్రాసలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కేవలం జబర్దస్త్కే పరిమితం కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పలు టీవీ కార్యక్రమాల్లోనూ సందడి చేస్తున్నాడు. నటనతో పాటు స్క్రిప్ట్ రైటింగ్లోనూ బాబుకు మంచి పట్టు ఉంది. ఇప్పటికే ఎన్నో కామెడీ స్కిట్లకు రచయితగా పనిచేశాడు. తాజాగా దర్శకత్వ రంగంలోకి అడుగుపెట్టి ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ మంచి నవ్వులు పంచడంతో దర్శకుడిగానూ బాబుకు గుర్తింపు లభించింది. ఇలా కెరీర్లో కొత్త విజయాలు అందుకుంటున్న సమయంలోనే తన ఏడేళ్ల ప్రేమకు పెళ్లితో ముగింపు పలికాడు. ఒకవైపు దర్శకుడిగా గుర్తింపు, మరోవైపు జీవిత భాగస్వామితో కొత్త ప్రయాణం మొదలుపెట్టడంతో బాబు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Corona Impact | దొంగలుగా మార్చిన కరోనా!.. హైదరాబాద్ పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు
Jabardasth Babu | జబర్దస్త్ బాబు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా… ఏడేళ్ల ప్రేమకు పెద్దల అంగీకారంతో శుభం కార్డు!
Hyderabad Students | సిమ్ లేదు.. నెట్వర్క్ అక్కర్లేదు.. సైనికుల కోసం బిట్స్ హైదరాబాద్ విద్యార్థుల అద్భుత ఆవిష్కరణ
SSC Exam | మార్చి 17 నుంచి పది పరీక్షలు?
Gen Z Protests | యూరప్‌లో కదంతొక్కిన జెన్‌జీ.. 25కి పైగా దేశాల్లో ఒకేసారి వీధుల్లోకి లక్షలాది మంది యువత
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

