Chalivagu project | చలివాగు ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగు నీరందించాలని బీఆర్ఎస్ ధర్నా
Chalivagu project | చలివాగు ప్రాజెక్టు నుండి రైతులకు సాగు నీరందించాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో గల రూపిరెడ్డిపల్లి-పరకాల జాతీయ రహదారిపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు.
జయశంకర్ భూపాలపల్లి : చలివాగు ప్రాజెక్టు నుండి రైతులకు సాగు నీరందించాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో గల రూపిరెడ్డిపల్లి-పరకాల జాతీయ రహదారిపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. చలివాగు ప్రాజెక్టు నుండి వెంటనే రైతులకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు పూర్తయిన ఇప్పటివరకు చలివాగు ప్రాజెక్టుకు సాగునీరు అందించకపోవడంతో రైతులు వరినారు సాగు చేయలేని దుస్థితి నెలకొందన్నారు. వందలాదిమంది రైతులు సాగునీటి కోసం తండ్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ కసాయి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల బాధలు తెలుసుకొని వెంటనే రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారిపై రైతులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించడంతో సుమారు గంటపాటు రాకపోకలు స్తంభించిపోయాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

