Arjun Tendulkar : భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్(Arjun Tendulkar) వివాహ బంధంలో అడుగుపెట్టాడు. ఆంథ్రోప్రెన్యూర్ సానియా చందోక్(Sania Chandok)ను పెళ్లి చేసుకున్నాడు. ముంబైలో వీరి కల్యాణ వేడుక ఆద్యంతం.. వైభవంగా జరిగింది. కొత్త జంటను ఆశీర్వదించేందుకు క్రీడా, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు భారీగా తరలి వెళ్లారు.
నిరుడు ఆగస్టు 25వ తేదీన అర్జున్, సానియా చందోక్‌ల నిశ్చితార్థం జరిగింది. మార్చి ఆరంభంలోనే ముందస్తు పెళ్లి వేడుకల్లో సచిన్ దంపతులు, కుటుంబసభ్యులు సందడి చేశారు. సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో సౌత్ ముంబైలో అర్జున్, సానియాల పెళ్లి కన్నులపండువగా జరిగింది.
Arjun Tendulkar, the son of Sachin Tendulkar, got married to Saaniya Chandhok today in Mumbai.❤️
Congratulations to Arjun and Saaniya. Best wishes for a happy life together. 💐 pic.twitter.com/HhkU9is64F
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) March 5, 2026
కొత్త జంటను దీవించేందుకు మాజీ ఆటగాళ్లు పెద్ద సంఖ్యలో వచ్చారు. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) భార్య సాక్షితో పాటు హాజరయ్యారు. వెటరన్ ప్లేయర్ సునీల్ గవాస్కర్(Sunil Gavaskar), మాజీ కోచ్‌లు రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, రవి శాస్త్రిలు సైతం కొత్త జంటను దీవించారు.
Wishing Arjun Tendulkar a life of happiness and joy. Congratulations to @sachin_rt and the entire family. 😇 pic.twitter.com/Bvl5qblhjo
— Aakash Chopra (@cricketaakash) March 5, 2026
టీమిండియా ప్రస్తుత కోచ్ గౌతం గంభీర్.. మాజీ హిట్టర్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ యూసుఫ్ పఠాన్లు సతీసమేతంగా విచ్చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఐసీసీ ఛైర్మన్ జై షా, కామెంటేటర్ హర్ష భోగ్లే.. తదితరులు కొత్త దంపతులైన అర్జున్ – సానియాకు అభినందనలు తెలిపారు.
Attended the wedding ceremony of Arjun and Saaniya in Mumbai today. It was a pleasure to be part of this special celebration and witness the beginning of a new journey for the young couple.
Conveyed my heartiest congratulations and best wishes to Bharat Ratna Sachin Tendulkar,… pic.twitter.com/bG5jvnW3We
— Devendra Fadnavis (@Dev_Fadnavis) March 5, 2026
దిగ్గజ క్రికెటర్ సచిన్ వారసత్వాన్ని కొనసాగిస్తున్న అర్జున్ టెండూల్కర్ దేశవాళీ, ఐపీఎల్లో మెరుస్తున్నాడు. అయితే.. తండ్రిలా జాతీయ జట్టు తరఫున చెలరేగి ఆడే అవకాశం మాత్రం మనోడికి ఇంకా దక్కలేదు. పేస్ ఆల్‌రౌండరైన అర్జున్ టీమిండియాకు ఆడాలంటే మరింత రాటుదేలాల్సి ఉంది. వధువు సానియా చందోక్ విషయానికొస్తే తను ఒక ఆంథ్రోప్రెన్యూర్.
सानिया चंडोक, सचिन तेंदुलकर की होने वाली बहू
सानिया का मुंबई में Mr. Paws Pet Spa & Store LLP नाम से पेट सैलून है, जिसके दो स्टोर खुल चुके हैं pic.twitter.com/pwbTrWwAw5— Third Eye (@mohan30682) August 14, 2025
ముంబైలో ఆతిథ్యం, ఆహార రంగాల్లో ప్రసిద్ధి గాంచిన గాహీ(Gahi) కుటుంబం ఆమెది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్‌లో చదివిన తను.. వెటర్నరీ టెక్నీషియన్ కూడా. ముంబైలో పెంపుడు జంతువుల కోసం సానియా మిస్టర్ పాస్(Mr Paws) అనే పెట్ స్పా నడుపుతోంది.