జైపూర్: పారిశ్రామిక ప్రాంతంలో గాలి కాలుష్యం వల్ల స్థానికులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డారు. 15 మంది పిల్లలతో సహా 22 మంది అస్వస్థత చెందారు. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. (Children Hospitalised) దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విషపూరితంగా మారిన గాలి కాలుష్యానికి కారణంపై దర్యాప్తు చేస్తున్నారు. రాజస్థాన్లోని సికర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం ఉదయం సికర్లోని పారిశ్రామిక వాడలో విష వాయువులు వెలువడ్డాయి. గాలి కాలుష్యం వల్ల స్థానికులు అస్వస్థత చెందారు. 15 మంది పిల్లలతో సహా 22 మంది ఆసుపత్రిలో చేరారు.
కాగా, సికర్ జిల్లా అదనపు కలెక్టర్ రతన్ లాల్ వెంటనే అప్రమత్తమయ్యారు. హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. అస్వస్థతకు గురైన పిల్లలు, పెద్దల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నదని వివరించారు.
మరోవైపు పారిశ్రామిక ప్రాంతం సమీపంలోని కొలిమిలో బట్టలు తగులబెట్టడం గాలి కాలుష్యానికి కారణంగా తెలుస్తున్నదని ఏడీఎం రతన్ లాల్ తెలిపారు. కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ఆదివారం సికర్లో గాలి నాణ్యత మోడరేట్ కేటగిరీలో నమోదైంది. గాలి నాణ్యత సూచిక 172గా ఉన్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు బులెటిన్ పేర్కొంది.
VIDEO | Rajasthan: More than 22 people, including 16 children, were hospitalised in Sikar after inhaling toxic fumes near an industrial area. Further details are awaited.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/ERnJoySRCO
— Press Trust of India (@PTI_News) November 23, 2025
Also Read:
School Girl Raped | స్కూల్ గ్రౌండ్లో బాలికపై అత్యాచారం.. ఆ తర్వాత ఇంజెక్షన్ ఇచ్చిన వ్యక్తి
Uranium In Breast milk | తల్లి పాలలో యురేనియం.. ఆందోళన కలిగిస్తున్న అధ్యయనం