మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి 50వ వివాహ వార్షికోత్సవం పూర్తయిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీని ఘనంగా నిర్వహించారు. స్వర్ణోత్సవంలో భాగంగా మేడ్చల్లో సీఎంఆర్ క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ ఈవెంట్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.