Bala Krishna | బాలయ్య ఆరోగ్యంపై నారా బ్రాహ్మణి అప్డేట్ ..మోకాలి శస్త్రచికిత్స విజయవంతం అంటూ కామెంట్
Bala Krishna | నందమూరి బాలకృష్ణ ఆరోగ్యంపై అభిమానులకు ఊరటనిచ్చే వార్త బయటకు వచ్చింది. ఇటీవల సినిమా షూటింగ్ సందర్భంగా యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా మోకాలికి గాయపడిన బాలయ్యకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు.
Bala Krishna | నందమూరి బాలకృష్ణ ఆరోగ్యంపై అభిమానులకు ఊరటనిచ్చే వార్త బయటకు వచ్చింది. ఇటీవల సినిమా షూటింగ్ సందర్భంగా యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా మోకాలికి గాయపడిన బాలయ్యకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో అభిమానులు, సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్ సమయంలో గాయపడిన వెంటనే బాలకృష్ణకు ప్రాథమిక చికిత్స అందించి అనంతరం ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఆస్పత్రికి తరలించారు. పరీక్షల అనంతరం మోకాలికి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించడంతో వెంటనే ఆపరేషన్ నిర్వహించారు. శస్త్రచికిత్స తర్వాత నెల రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో బాలయ్య కుమార్తె నారా బ్రాహ్మణి సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ఆరోగ్య వివరాలను వెల్లడించారు. నాన్నకు నిర్వహించిన శస్త్రచికిత్స పూర్తిగా విజయవంతమైంది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. తన పాత ఉత్సాహాన్ని తిరిగి పొందారు. త్వరలోనే మళ్లీ తన పనుల్లోకి వస్తారు. ఈ సమయంలో ఆయన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ మా కుటుంబం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు చూపించిన ప్రేమ, అభిమానం మాకు ఎంతో ధైర్యాన్నిచ్చాయి అంటూ ఆమె భావోద్వేగంగా పేర్కొన్నారు.
బ్రాహ్మణి చేసిన ఈ పోస్ట్‌తో బాలయ్య అభిమానుల్లో ఆనందం నెలకొంది. సోషల్ మీడియాలో వేలాది మంది అభిమానులు ఆయన త్వరగా పూర్తిగా కోలుకుని మళ్లీ అదే ఉత్సాహంతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆకాంక్షిస్తూ సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ ఆస్పత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, మరో మూడు నుంచి నాలుగు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశముందని సమాచారం. అనంతరం ఇంట్లోనే నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకుని పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి షూటింగ్లలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, బాలకృష్ణకు గాయం కావడంతో ఆయన నటిస్తున్న NBK 111 సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. హీరో పూర్తిగా కోలుకున్న తర్వాత మిగిలిన షెడ్యూల్‌ను తిరిగి ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. బాలయ్య త్వరగా కోలుకుని మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

